చేతులారా చేసుకున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రిలీజ్ కాకముందే ఒక విధమైన నెగెటివ్ వైబ్రేషన్ వుంది. సినిమా పట్ల విజయ్ చూపించిన అనాసక్తి, సిక్స్ కొట్టడానికి ట్రై చేసా కానీ సిక్స్ వెళుతుందో, క్యాచ్…

విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రిలీజ్ కాకముందే ఒక విధమైన నెగెటివ్ వైబ్రేషన్ వుంది. సినిమా పట్ల విజయ్ చూపించిన అనాసక్తి, సిక్స్ కొట్టడానికి ట్రై చేసా కానీ సిక్స్ వెళుతుందో, క్యాచ్ అవుతుందో తెలీదు అనే కామెంట్లు ఈ చిత్రం పట్ల అనుమానాలకి తావిచ్చాయి. అంచనా వేసిన దాని కంటే ఈ చిత్రం నీరసంగా సాగడంతో తొలి రోజు మొదటి ఆట తరువాతే పతనం ప్రారంభమయింది.

మొదటి ఆదివారం వసూళ్లు, మొదటి శనివారం కంటే తక్కువ రావడంతో ఇక ఈ చిత్రం డిజాస్టర్ అనేది ఖరారయింది. నష్టాల పరంగా చూస్తే విజయ్ చిత్రాల్లో అతి పెద్ద ఫ్లాప్ అయిన ఈ చిత్రం అతని కథల ఎంపిక పట్ల డౌట్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం పరాభవంతో ‘హీరో’ చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆ చిత్రానికి అయిన ఖర్చులో సగం భరించడానికి సదరు నిర్మాతలతో ఒప్పందం కూడా జరిగింది.

దర్శకుల పనిలో తల దూర్చడం, అదే పనిగా అర్జున్‌రెడ్డిని అనుకరించడంతో విజయ్ చేతులారా తన క్రేజ్‌ని పాడు చేసుకున్నాడు.ఇదిలావుంటే విజయ్ ఇప్పుడు పూరి జగన్నాథ్‌ని విపరీతంగా నమ్ముతున్నాడు. తన కెరీర్‌ని మలుపు తిప్పేస్తాడని ఆశిస్తున్నాడు. అయితే పూరి ఫామ్‌లో లేడనేది సుస్పష్టం. ఇస్మార్ట్ శంకర్‌ని కూడా ఫ్లూక్‌గానే పరిగణిస్తారు కనుక నిజంగా పూరి తన పూర్వపు టాలెంట్ చూపించి పోకిరి లాంటి సినిమా ఇస్తే తప్ప విజయ్ కోరుకుంటోన్న ఇమేజ్ మేకోవర్ కష్టం.