అక్టోబర్ 19.. దసరా సీజన్.. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ భారీ సినిమా భగవత్ కేసరి విడుదల. అదే రోజు తమిళ డబ్బింగ్ సినిమా లియో విడుదల. విజయ్ హీరో. గమ్మత్తేమిటంటే ఈ సినిమాను పంపిణీ చేస్తున్నది బాబీ-బాలయ్య సినిమా నిర్మాతలు సితార అధినేతనే. ఇప్పుడు ఈ రెండు సినిమాలు అక్టోబర్ 19న ఢీకొంటున్నాయి.
ఈ రెండు సినిమాలు అలా వుంటే రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా అప్పుడే. కానీ పక్కాగా వస్తుందా.. రాదా అన్నది క్లారిటీ లేదు. నిర్మాతలు మాత్రం విడుదల కన్ ఫర్మ్ అంటున్నారు. కానీ ఇండస్ట్రీ టాక్ మాత్రం ఇంకా వర్క్ వుంది రావడం కష్టం అని. ఒకవేళ ఆ సినిమా కూడా విడుదల వుంటే దసరా సీజన్ గట్టి పోటీ వుంటుంది.
బాలయ్య సినిమా, రవితేజ సినిమాలతో విజయ్ సినిమా కూడా పోటీ పడాల్సి వుంటుంది. రెండు సినిమాలు వుంటే ఫరవాలేదు. కానీ మూడు సినిమాలు వుంటే మాత్రం కాస్త కష్టమే. యావరేజ్ టాక్ వచ్చిన సినిమా నిలదొక్కుకోలేదు. అదే రెండు సినిమాలు వుంటే పండగ సీజన్ కనుక రెండూ పాసైపోతాయి.