Advertisement

Advertisement


Home > Movies - Movie News

విక్రమ్… ఎవరికీ పట్టదేం?

విక్రమ్… ఎవరికీ పట్టదేం?

కమల్ హాసన్ సినిమా వస్తోంది అంటే ఒకప్పుడు అదో క్రేజ్. సినిమా హిట్..ఫ్లాప్ తో సంబంధం లేకుండా జనం చూడడానికి ఇష్టపడేవారు. అలాంటిది కమల్ తో పాటు విజయ్ సేతుపతి…ఫాహద్ ఫాజిల్ కూడా నటిస్తున్న విక్రమ్ సినిమా వస్తుంటే ఏ రేంజ్ హడావుడి వుండాలి. 

టీజర్ వచ్చింది. బానే వుండేలా వుంది అనుకున్నారు. ట్రయిలర్ వచ్చింది. సరేలే అనుకున్నారు. మరో తొమ్మిది రోజుల్లో సినిమా వస్తోంది. కానీ ఆ హడావుడే కనిపించడం లేదు ఎక్కడా?

అంత భారీ మల్టీ స్టారర్ వస్తోంది అంటే అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో సినిమా అంటే హడావుడి ఎలా వుండాలి. పైగా ఈ సినిమా హక్కులను ఏకంగా ఆరు కోట్లు ఖర్చు చేసి హీరో నితిన్ తండ్రి సుధాకరరెడ్డి మరో ఇద్దరు బయ్యర్లు కలిసి కొన్నారు. ముగ్గురు మూడు రెళ్లు ఆరు కోట్లు పెట్టుబడి పెడుతున్నారు.

కానీ సమస్య ఏమిటంటే విక్రమ్ సినిమా విడుదల ముందు వారం ఎఫ్ 3 వస్తోంది. దాని ప్రచారం, దాని హడావుడి మామూలుగా లేదు. ఆ హడావుడి ముందు అసలు విక్రమ్ సినిమా వస్తోందన్న ఊసు..ధ్యాస కనిపించడం లేదు. పైగా జనాలు థియెటర్ కు రావడమే గగనంగా వుంది. ఎఫ్ 3 కి ఇంత హడావుడి జరిగితే, జరుగుతుంటే టికెట్ లు నెమ్మదిగా తెగుతున్నాయి. 

శుక్రవారం నాటికి టోటల్ ఫుల్స్ వచ్చేలా కనిపిస్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలో విక్రమ్ కు ఎంత హడావుడి చేయాలి. సమస్య ఏమిటంటే తమిళ భారీ సినిమాలను మన వాళ్లు భారీ రేట్లు పెట్టి కొంటారు. కానీ ఆ తమిళ సినిమా మేకర్లు కానీ, హీరోలు కానీ తెలుగు వెర్షన్ ప్రచారం పెద్దగా పట్టించుకోరు. 

ఏదో చేయాలి అన్నట్లు ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసి ఊరుకుంటారు. ఇది ఈ ఏడాది విడుదలైన అన్ని తమిళ భారీ సినిమాల విషయంలో జరిగిందే. ఆ సినిమాల బయ్యర్లు అంతా నష్టాలు మూటకట్టుకున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?