కెరీర్ ఆరంభంతో పోలిస్తే, ఇప్పుడే ఎక్కువ గ్లామర్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది నటి అనుష్కా శర్మ. చాలా కాలం పాటు కొహ్లీతో ప్రేమాయణం, అతడితోనే పెళ్లి.. ఇలా అనుష్క సూపర్ సెలబ్రిటీ అయిపోయింది. హీరోయిన్ గా కన్నా కొహ్లీ భార్యగా ఎక్కువ గుర్తింపు వచ్చింది. హీరోయిన్ గా అయితే కేవలం హిందీ సినిమాలు బాగా చూసే వాళ్లకే తెలుస్తుంది, అదే కొహ్లీ భార్యగా భారత క్రికెట్ అభిమానులందరిలోనూ అనుష్క గుర్తింపు తెచ్చుకుంది.
ఇక కొహ్లీ తో ప్రేమ, పెళ్లి.. సందర్భాల్లో కూడా సినిమాల్లో నిర్మొహమాటంగా నటిస్తూ వచ్చింది అనుష్క. ప్రేమ, పెళ్లి అంటూ పరిమితులు పెట్టుకోకుండా సినిమాల్లో రొమాంటిక్ గా , గ్లామరస్ గా నటిస్తూ వచ్చింది. ఇక తాజాగా ఒక మ్యాగజైన్ కోసం ఆమె సూపర్ హాట్ పోజులు ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రమ్ అకౌంట్లో పోస్టు చూస్తూ వస్తోంది. ఒకదాని తర్వాత మరోటి, ఒకదానికి మించి మరోటి హాట్ హాట్ గా ఉన్నాయవి.
ఈ పిక్స్ పై కొహ్లీ కూడా స్పందించడం విశేషం. ప్రత్యేకంగా పదాలతో కాకుండా ఇమోజీలతో కొహ్లీ స్పందించాడు. సింపుల్ గా లవ్ సింబల్స్ తో ఆమె ఫొటోలపై స్పందించాడు. అలియా భట్, ఊర్వశీ రౌతెల్లా లాంటి వాళ్లు కూడా అనుష్క హాట్ నెస్ ను అభినందిస్తూ, ఆమె చాలా అందంగా ఉందంటూ ఈ ఫొటోల కింద కామెంట్లు పెట్టారు.