Advertisement

Advertisement


Home > Movies - Movie News

విరూపాక్ష దర్శకుడితో చైతన్య

విరూపాక్ష దర్శకుడితో చైతన్య

విరూపాక్ష సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు కొత్త దర్ళకుడు కార్తీక్ వర్మ దండు. దాంతో అందరి చూపు అతనివైపు మళ్లింది. తరువాత సినిమా ఎవరితో, ఏ బ్యానర్ లో వుంటుందా? అన్న ఆసక్తి కొన్నాళ్లు నడిచింది. తరువాత సైలంట్ అయింది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత బివిఎస్ఎస్ఎన్ ప్రసాద్ కే మలి సినిమా కూడా చేయబోతున్నాడు కార్తీక్. అంతే కాదు, ఈసారి మరో క్రేజీ యంగ్ హీరో కాంబినేషన్ పట్టుకున్నాడు.

యంగ్ హీరో నాగ్ చైతన్య- కార్తీక్ వర్మ- బోగవిల్లి ప్రసాద్ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయింది. ఆ అనౌన్స్ మెంట్ త్వరలో వస్తుంది. చైతన్య చాలా జాగ్రత్తగా సబ్జెక్ట్ లు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గీతా సంస్థలో చందు మొండేటితో పాన్ ఇండియా సినిమా తండేళ్లు నిర్మాణంలో వుంది. ఈ సినిమా తరువాత కార్తీక్ వర్మ సినిమా మీదకు వస్తాడు.

ఈసారి కార్తీక్ వర్మ ఏ జానర్ చేయబోతున్నారో చూడాలి. విరూపాక్ష వైవిధ్యమైన థ్రిల్లర్. అస్సలు కమర్షియల్ ఫార్ములా జోలికి వెళ్లకుండా తీసి జనాలను కూర్చో పెట్టారు. అందువల్ల కచ్చితంగా రెండో సినిమా మీద మంచి అంచనాలు వుంటాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?