Advertisement

Advertisement


Home > Movies - Movie News

విష్వక్ కు సరైన సినిమా

విష్వక్ కు సరైన సినిమా

విష్వక్ సేన్ కు సరైన సినిమా పడడం లేదు. హిట్ లాంటి సినిమా తరువాత మళ్లీ మరో మాంచి సినిమా చేతిలోకి రాలేదు. ఒక సినిమా ఇలా ప్రారంభమై అలా మళ్లీ తన చేతుల్లోకే తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఓ ప్రామిసింగ్ సినిమా వచ్చింది. దర్శకుడిగా అభిరుచి వున్న సీనియర్ హీరో అర్జున్ తన కుమార్తెను తెలుగులో లాంచ్ చేయడానికి సిద్దపడ్డారు. ఆ ప్రాజెక్టుకు విష్వక్ ను హీరోగా తీసుకున్నారు. 

ఈ ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టడం విశేషం. సాధారణంగా ఇలాంటి వాటికి ఆయన బయటకు రావడం చాలా తక్కువ. కేవలం అర్జున్ మీద అభిమానంతో వచ్చి వుండొచ్చు. అర్జున్ సొంత బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ తెలుగులో కథానాయికగా పరిచయం అవుతున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, ప్రకాష్ రాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మంచు విష్ణు స్క్రిప్ట్ ని హ్యాండోవర్ చేశారు. 

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అర్జున్ కలవాలని అడిగితే షాక్ అయ్యా. ఎందుకో అర్ధం కాలేదు. 'నేను డైరెక్ట్ చేస్తున్న కథ చెప్తా విను' అనగానే చాలా సర్ ప్రైజ్ అయ్యా. ఇది నా విష్ లిస్టులో వున్న సినిమా. అంత గొప్ప కథ. ఈ సినిమా కథ అన్నిటికంటే పెద్దగా కనిపించింది. రవి బసూర్ ఇంత త్వరగా సినిమా చేస్తానని అనుకోలేదు. బుర్రా సాయి మాధవ్ తో పని చేయడం ఆనందంగా వుంది అన్నారు.

ఇన్నేళ్ళుగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు, పరిశ్రమకి నా కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ ని పరిచయం చేస్తున్నందుకు గర్వంగా వుంది. తను ఒక తమిళ్ సినిమా, నా దర్శకత్వంలో ఒక కన్నడ సినిమా చేసింది. ఇప్పుడీ తెలుగు సినిమా చేయబోతుంది. . డబ్బులు ఇచ్చి ప్రేక్షకులు సినిమా చుస్తున్నారనే భయం ఆర్టిస్ట్ లో ఉంటేనే విజయం సాధిస్తారని చెప్తాను. పరిశ్రమలో నాకు 42 ఏళ్ళు. ఈ ప్రయాణంలో ఇండస్ట్రీ నవ్వు, ఏడుపు, నొప్పి, విజయం, అపజయం ఇలా అన్నీ నేర్పించింది. ఇలాంటి అద్భుతమైన పరిశ్రమకి నా కుమార్తెని పరిచయం చేస్తున్నందుకు చాలా గర్వంగా వుంది. ఒక మంచి సినిమాని తెలుగు చిత్ర పరిశ్రమకి ఇస్తాననే నమ్మకం వుంది. త్వరలోనే టైటిల్ ని ప్రకటిస్తాం.'' అన్నారు.

ఐశ్వర్య అర్జున్ మాట్లాడుతూ.. ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి రావడం ఆనందంగా వుంది'' అన్నారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ని ఇక్కడ చూసి సర్ ప్రైజ్ అయ్యాను. ''మీరు ఇక్కడ ఏంటి ?' అని అడిగాను. అర్జున్ అంటే ఇష్టం. అద్భుతమైన వ్యక్తి. ఆయన పక్కన నిల్చోవాలనిపించింది'' అన్నారు. ఇది అర్జున్ ఇన్నేళ్ళుగా సంపాదించుకున్న మంచితనం అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?