ఒక్కోసారి ఇంతే..చినికి చినికి గాలివాన అవుతుంది. ఏదో చేయబోతే ఇంకేదో అవుతుంది. అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ విషయంలో ఇలాగే జరిగింది.
ఈ సినిమా ప్రమోషన్ కోసం విష్వక్ సేన్ ఓ ఫ్రాంక్ విడియో చేసారు. అలా రోడ్ మీద ఫ్రాంక్ చేయడం వల్ల పబ్లిక్ న్యూసెన్స్ జరుగుతోందని, ఈ ఫ్రాంక్ వీడియో మీద టీవీ 9 ఛానెల్ లో డిస్కషన్ పెట్టారు. ఈ విషయం తెలిసి విష్వక్ సేన్ అదే డిస్కషన్ లో పాల్గొనడానికి ఆ చానెల్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.
కాస్సేపు డిస్కషన్ అయిన తరువాత న్యూస్ యాంకర్ కు, విష్వక్ సేన్ కు మధ్య వాగ్వివాదం చెలరేగింది. తనను పాగల్ సేన్ అని పిలవడం కరెక్ట్ కాదని, క్యారెక్టర్ అసాసినేషన్ సరికాదని విష్వక్ వారించాడు. దానికి యాంకర్ ‘గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో’ అని అనడం విశేషం.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. గమ్మత్తేమిటంటే నెటిజన్లు అంతా విష్వక్ కు మద్దతుగా నిలవడం, యాంకర్ తీరు బాగాలేదు అని విమర్శించడం గమనార్హం.
ఒక్కసారిగా అశోకవనంలో అర్జునకళ్యాణం సినిమా టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయిపోయంది. మిగిలిన న్యూస్ చానెళ్లు అన్నీ విష్వక్ కు మద్దతుగా అతనితో బైట్ తీసుకోవడం, ఇంటర్వ్యూ చేయడం చేస్తున్నాయి.