వైట్ల హిట్ సినిమాల్ని గుర్తుచేసిన విశ్వం

శ్రీను వైట్ల సినిమాలకు ఓ మార్క్ ఉంది. అతడి సినిమాల్లో అది అడుగడుగునా కనిపిస్తుంది. హీరో ఎలివేషన్ కావొచ్చు, కామెడీ సీన్లు కావొచ్చు, ప్రాస డైలాగ్స్ కావొచ్చు… ఇలా ప్రతి సెగ్మెంట్ లో వైట్ల…

శ్రీను వైట్ల సినిమాలకు ఓ మార్క్ ఉంది. అతడి సినిమాల్లో అది అడుగడుగునా కనిపిస్తుంది. హీరో ఎలివేషన్ కావొచ్చు, కామెడీ సీన్లు కావొచ్చు, ప్రాస డైలాగ్స్ కావొచ్చు… ఇలా ప్రతి సెగ్మెంట్ లో వైట్ల మార్క్ ఉండాల్సిందే. చివరికి కెమెరా యాంగిల్స్ లో కూడా వైట్ల కు స్టయిల్ ఉంది.

గతంలో వైట్ల తీసిన దూకుడు, ఆగడు, బాద్షా, వెంకీ, రెడీ లాంటి సినిమాల్లో అతడి స్టయిల్ చూశాం. తాజాగా రిలీజైన విశ్వం సినిమా టీజర్ కూడా ఆ ఛాయల్లోనే ఉంది.

టీజర్ లో గోపీచంద్ ఎలివేషన్స్ చూస్తుంటే ఆగడు సినిమా గుర్తొస్తుంది. ట్రయిన్ ఎపిసోడ్ చూస్తుంటే వెంకీ, హీరోయిన్ ట్రాక్ చూస్తుంటే దూకుడు, కామెడీ సీన్స్ చూస్తుంటే రెడీ.. ఇలా ఈ దర్శకుడు తీసిన హిట్ సినిమాలన్నీ గుర్తొస్తున్నాయి. అదేంటో, చివరికి చైతన్ భరధ్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా శ్రీనువైట్ల పాత సినిమాలనే పోలి ఉంది.

ఓవరాల్ గా విశ్వం సినిమా టీజర్ లో కొత్తదనం కనిపించలేదు కానీ ఈ దర్శకుడి హిట్ సినిమాల ఛాయలు మాత్రం కనిపించాయి. కంటెంట్ క్లిక్ అయితే శ్రీనువైట్లకు ఎట్టకేలకు ఓ హిట్ దక్కినట్టే.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 11న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

5 Replies to “వైట్ల హిట్ సినిమాల్ని గుర్తుచేసిన విశ్వం”

  1. జగన్ మీద ప్రజల అంత ఆగ్రహం ఉంటుందని, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ప్రధాన కారణాలలో ఒకటి కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా కమ్మ, కాపు కులాలపై. ప్రజలు ఈ కుల విద్వేషాలపై విసుగు చెంది, జగన్ కోసం ఓట్లు వేసే బదులు, ఈ కుల విద్వేషాలను ప్రోత్సహిస్తున్న జగన్ పార్టీపై మరింత ద్వేషం పెంచుకున్నారు.

    ఇంకో పెద్ద సమస్య అమరావతి రాజధాని అంశం. ప్రజలు తమకు కావలసిన పాఠాలు నేర్చుకున్నారు, కానీ కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్న వైసీపీ అనుచరులు తమ సొంత పార్టీకి హాని చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పటికే జగన్‌కి ఒక పెద్ద షాక్ ఇచ్చారు ఈ ద్వేష వ్యాపారం వల్ల. పార్టీ నిలబడాలంటే కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం తక్షణమే ఆపాలి. వైసీపీ అనుచరులు పెద్దవాళ్లలా ఆలోచించాలి, మంచి మనుషులుగా మారండి, విభజనల్ని ప్రోత్సహించడం మానుకోండి.

Comments are closed.