Advertisement

Advertisement


Home > Movies - Movie News

అంతా లీకుల ప్రకారమే.. మరో వికెట్ డౌన్!

అంతా లీకుల ప్రకారమే.. మరో వికెట్ డౌన్!

సోషల్ మీడియాలో వస్తున్న లీకుల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా దూసుకుపోతోంది బిగ్ బాస్. ఉత్కంఠగా సాగాల్సిన ఎలిమినేషన్స్ ప్రక్రియ 2 రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో వచ్చేస్తుండడంతో అంతా నవ్వుకుంటున్నారు. చివరికి కీలకమైన ఎలిమినేషన్స్ అయినా రహస్యంగా ఉంచి, ఉత్కంఠ పెంచుతారనుకుంటే అది నిర్వహకుల వల్ల కావడంలేదు.

తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 నుంచి వితిక ఎలిమినేషన్ అయింది. ఈసారి వితిక హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోతుందని గురువారం నుంచే లీకులు మొదలయ్యాయి. అది ఆదివారం నిజమైంది. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈసారి సోషల్ మీడియాలో ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా బయటకు వచ్చేసింది.

అలీ, వితిక, వరుణ్, శివజ్యోతి ఎలిమినేషన్ రౌండ్ కు నామినేట్ అయ్యారు. వీళ్ల మధ్య ఓ గేమ్ ఆడించి శివజ్యోతిని సేఫ్ చేశాడు బిగ్ బాస్. ఆ తర్వాత మరో గేమ్ ఆడించి అలీని కూడా సేవ్ చేశాడు. చివరికి అసలైన ఎలిమినేషన్ రౌండ్ ను వితిక-వరుణ్ మధ్య నడిపించాడు. మరో ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడించి వితికను ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ ప్రాసెస్ లో దాదాపు సగం ముందుగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఏం జరగబోతోంది, ఎలా జరగబోతోందనే విషయం శుక్రవారం నుంచే వివిధ సామాజిక మాధ్యమాల్లో కనిపించింది.

అసలే ఈసారి కంటెస్టెంట్లు వీక్, దానికి తోడు ఈ లీకులు బిగ్ బాస్ సీజన్ 3పై హైప్ ను పూర్తిగా నీరుగార్చేశాయి. అయితే మధ్యలో ప్రేక్షకుల ఆసక్తి తగ్గినప్పటికీ, షో చివరికి వచ్చేకొద్దీ ఆడియన్స్ లో షోపై కాస్త ఉత్సుకత పెరిగింది. మిగిలింది మరికొన్ని వారాలే కావడంతో విజేత ఎవరనే అంశంపై ఆసక్తి క్రమక్రమంగా పెరుగుతోంది. బిగ్ బాస్ టీఆర్పీలు కాస్త మెరుగుపడడం దీనికి సాక్ష్యం. 

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?