దర్శకుడు వివేక్ ఆత్రేయ అంటే అవుట్ అండ్ అవుట్ ఫన్. పెద్దగా సవాళ్లు..ప్రతి సవాళ్లు..వీర ఫైట్ లు ఇలాంటి వాటికి ఇప్పటి వరకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఆ దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
అంటే సుందరానికి సినిమా తరువాత మళ్లీ మరో సినిమాను హీరో నాని తోనే చేస్తున్నాడు వివేక్ ఆత్రేయ. నిర్మాత డివివి దానయ్య. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ బలంగా వుంటుందని తెలుస్తోంది. అంటే ఈసారి వివేక్ తన బాట మారుస్తున్నట్లే అనుకోవాలి.
నాని కూడా చేసిన జానర్ లో వెంటనే చేయకుండా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయలేదు. దసరా మాస్ సినిమానే కానీ రఫ్ అండ్ రగ్డ్ జానర్. అదే విధంగా సివిఎమ్ నిర్మాణంలో చేస్తున్న సినిమా నిన్నుకోరి మోడల్ లో వుండే ప్యూర్ లవ్ స్టోరీ. అందువల్ల మళ్లీ మరోసారి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేసే ఆలోచన వున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది వివేక్ సినిమాకు. దసరా విడుదల కావడం, దాని తరువాత వీలయినంత త్వరగా సివిఎమ్ నిర్మాణంలో సినిమా పూర్తి చేయడం జరగాల్సి వుంది. దాని తరువాత ఈ ఏడాదిలోనే వివేక్ ఆత్రేయ సినిమా సెట్ మీదకు వెళ్తుంది.