చీర కాదు..గౌను కాదు..పొట్టి కాదు పొడవు కాదు..తెలుపు కాదు నలుపు కాదు..బొద్దు కాదు సన్నం కాదు..అమ్మాయి అయితే చాలు మగ బుద్ది ఒక్కటే అంటూ సాగిన చంద్రబోస్ రచన ఇప్పుడు యూ ట్యూబ్ ను ఊపేస్తోంది. పుష్ప సినిమా కోసం దేవీశ్రీప్రసాద్ స్వరాలకు చంద్రబోస్ రాసిన గీతం ఫుల్ మాస్ అండ్ క్యాచీ గా వుంది. సమంత మీద చిత్రీకరించిన ఈ ప్రత్యేక గీతం కచ్చితంగా ఙనాదరణకు నోచుకునేలా వుంది.
ముఖ్యంగా ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్ పక్కాగా సెట్ అయింది. పాట మొత్తం ప్రొవోకింగ్ టోన్ లో సాగింది. సుకుమార్ సినిమాల్లో ఐటమ్/ప్రత్యేక సాంగ్ లకు ఓ ప్రత్యేకత వుంది. పాటలో ఒక ధీమ్ వుంటుంది. ఈ పాటలో కూడా అలాంటి థీమ్ పద్దతిని కంటిన్యూ చేసారు
మగ బుద్ది ఒకలాగే వుంటుంది. పొట్టి పొడవు, తెలుపు నలుపు, లావు సన్నం కాదు అంటూ ఒక్కో చరణం రాసుకంటూ పోయారు. పాట కు వాడిన ఇనుస్ట్రుమెంటేషన్ చాలా సింపుల్ గా వుంది. కింద లెవెల్ లో మారుమోగేలా తయారు చేసారు.
అయితే గతంలో వచ్చిన సూర్య వీడొక్కడే సినిమాలో హానీ హానీ అంటూ వచ్చిన హారిష్ జయ్ రాజ్ సాంగ్ నుంచి కొంత ఇనుస్ట్రుమెంటేషన్ ను, బీట్ స్టయిల్ ను తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్లు ఙోరుగా కనిపిస్తున్నాయి.