వార్ 2 తరువాత ఎన్టీఆర్ మరో సినిమా

వార్ 2 సినిమాతో తన పాన్ ఇండియా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా సోలో మూవీ కాదు. మల్టీ స్టారర్. పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువ.…

వార్ 2 సినిమాతో తన పాన్ ఇండియా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా సోలో మూవీ కాదు. మల్టీ స్టారర్. పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువ. కానీ ఆ పాత్రను అలా వదిలేయడం లేదట వార్ 2 మేకర్లు.

స్పై యూనివర్స్ లో భాగంగా ఎన్టీఆర్ చేస్తున్న పాత్రను కొనసాగిస్తూ, సోలో పాత్రగా మరో సినిమాను చేయాలని డిసైడ్ అయ్యారట. అంటే వార్ 2 తరువాత అదే బ్యానర్ లో, అదే పాత్రతో మరో సినిమా వుంటుందన్నమాట.

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లతో దర్శకుడు అయాన్ ముఖర్జీ వార్ 2 సినిమా మొదలుపెట్టారు. అది వచ్చే ఏడాది విడుదలవుతుంది. వార్ కు వార్ 2 అదనంగా వచ్చిన నటుడు ఎన్టీఆర్. అతని పాత్ర. ఇప్పుడు ఆ పాత్రను అలా వదిలేయకుండా దాన్నే ప్రధానంగా తీసుకుంటూ వార్ 3 అని కావచ్చు, లేదా మరో టైటిల్ తో కావచ్చు ఇంకో సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు బయటకు వచ్చాయి.

ప్రస్తుతం దేవర సినిమాను కొరటాల శివతో చేస్తున్నారు ఎన్టీఆర్. దాంతో పాటే వార్ 2 చేయాలి. దాని తరువాత ప్రశాంత్ నీల్ సినిమా చేయాలి. ఆ తరువాత ఈ కొత్త ప్రాజెక్ట్ అంటే ఏ 2026 లేదా 2027 అవుతుందేమో?