Advertisement

Advertisement


Home > Movies - Movie News

వీకెండ్ రిలీజ్.. ఏం టైమింగ్ గురూ..!

వీకెండ్ రిలీజ్.. ఏం టైమింగ్ గురూ..!

కష్టపడి తీసిన సినిమాకు మంచి రిలీజ్ డేట్ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ రిలీజ్ అయినా దానితోపాటు మరిన్ని సినిమాలు పోటీ. ఆల్రెడీ థియేటర్లలో ఉన్న సినిమాలతో పోటీ. ఇలా మేకర్స్ కంట్రోల్ లో లేని ఎన్నో పరిస్థితులు సినిమాపై ప్రభావం చూపిస్తాయి. ఇలాంటివేం లేకుండా సాఫీగా రిలీజై, పోటీ కూడా లేని పరిస్థితి ఉంటే..? ఓ సినిమాకు అంతకంటే ఇంకేం కావాలి. ఓం భీమ్ బుష్ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది.

గత వారం 'షరతులు వర్తిస్తాయి', రజాకార్, తంత్ర, లంబసింగి లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు. ఇక ఈవారం వందేభారత్, లైన్ మ్యాన్, యమధీర లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవేవీ పోటీనిచ్చే మూవీస్ కాదు. ఇక నువ్వు-నేను, ఈరోజుల్లో లాంటి రీ-రిలీజెస్ ఉన్నాయి. ఇవన్నీ లిమిటెడ్ స్క్రీన్స్ లో వస్తున్నాయి.

సో.. ఓం భీమ్ బుష్ సినిమాకు ఎలాంటి పోటీ లేదు. పైగా ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి. వీళ్ల టార్గెట్ కూడా టీనేజ్ పిల్లలు, యూత్ ఆడియన్సే. ఇలా శ్రీవిష్ణు సినిమాకు అన్నీ కలిసొచ్చాయి.

రేపు భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ మౌత్ టాక్ వచ్చినా, మరో జాతిరత్నాలు అవుతుంది. మరి ఈ అనుకూల పరిస్థితుల్ని ఓం భీమ్ బుష్ ఏ మేరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?