సస్పెన్స్ వీడింది. విష్ణు-వైట్ల కలిశారు. సూపర్ హిట్ 'ఢీ' సినిమాకు సీక్వెల్ ఎనౌన్స్ చేశారు. 'డి & డి' అనే టైటిల్ కూడా ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ ఒరిజినల్ మూవీలో సూపర్ హిట్టయిన 2 పాత్రలు సీక్వెల్ లో ఉంటాయా అనేది అందరి డౌట్.
ఆ రెండు పాత్రల్లో ఒకటి శ్రీహరి క్యారెక్టర్. 'ఢీ' సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే పాత్ర శ్రీహరిది. కొన్ని సందర్భాల్లో రౌద్రంగా, మరికొన్ని సందర్భాల్లో సరదాగా కనిపించే ఈ పాత్ర సినిమాలో హైలెట్. మరి సీక్వెల్ లో శ్రీహరి స్థానాన్ని భర్తీచేసేది ఎవరు? రావురమేష్, ప్రకాష్ రాజ్, అజయ్ లాంటి నటులున్నప్పటికీ.. వాళ్లు శ్రీహరిని మరిపించగలరా?
ఇక మరో కీలక పాత్ర జయప్రకాష్ రెడ్డిది. 'ఢీ' లో జయప్రకాష్ రెడ్డికి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. కేవలం హావభావాలతో ఆయన పండించిన కామెడీ అద్భుతం. మరి ఆ పాత్రను ''డి & డి''లో కూడా కంటిన్యూ చేస్తారా అనేది డౌట్.
శ్రీహరి, జయప్రకాష్ రెడ్డి ఈ లోకాన్ని వీడి వెళ్లారు. సీక్వెల్ లో వాళ్ల పాత్రల్ని మరొకరితో చేయించకపోవడమే మంచిది. ఇప్పుడెలాగూ టైటిల్ లో సీక్వెల్ అని చెప్పి, సినిమాలో కొత్త కథలు ప్రజెంట్ చేస్తున్నారు. 'డి & డి' కూడా అదే ఫార్మాట్ లో ఉండే అవకాశం ఉంది.