చిన్న వ‌య‌స్సులో ప్రాణాలు కోల్పోయిన న‌టి

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉన్న బాలీవుడ్ న‌టి అనారోగ్యంతో ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. ఇటీవ‌ల ప‌లువురు చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు వివిధ కార‌ణాల‌తో క‌న్ను మూసిన విష‌యం తెలిసిందే.  Advertisement ఆ విషాదం…

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉన్న బాలీవుడ్ న‌టి అనారోగ్యంతో ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. ఇటీవ‌ల ప‌లువురు చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు వివిధ కార‌ణాల‌తో క‌న్ను మూసిన విష‌యం తెలిసిందే. 

ఆ విషాదం నుంచి కోలుకోకుండానే మ‌రో యువ న‌టి ప‌ర‌లోకానికి వెళ్లిపోయారు. బాలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌తో అల‌రించిన మిష్టీ ముఖ‌ర్జీ (27) కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ,  చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

చిన్న వ‌య‌స్సులో ఇండ‌స్ట్రీలోకి ఆమె అడుగు పెట్టారు. ప‌దేళ్లుగా  బాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకు న్నారామె. మొద‌ట న‌టిగా బాలీవుడ్‌లో అడుగు పెట్టిన మిష్టీ 2012లో లైఫ్ కి తో ల‌గ్ గ‌యి అనే సినిమాతో కెరీర్ ప్రారంభించారు. రజనీష్ దుగ్గల్ తో కలిసి గోవింద ఆలే రే అనే డ్యాన్స్ నెంబర్ చేశారు.

ఈ చిత్రంలో హృతిక్ రోషన్ , కత్రినా కైఫ్ ప్ర‌త్యేకంగా క‌నిపించ‌గా, జూహి చావ్లా ప్రధాన పాత్రలో నటించారు. మిష్టీ మ్యూజిక్ వీడియోలతో పాటు బెంగాలీ సినిమాల్లోనూ  ప‌ని చేశారు. 2014లో ఆమెపై సెక్స్ రాకెట్, పోర్నోగ్రఫీ కంటెంట్‌ వంటి ఆరోపణలు వచ్చాయి. 

అప్ప‌ట్లో ఆమెతో పాటు ఆమె తండ్రి, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. కొంత కాలంగా కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆమె బెంగ‌ళూరులోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. చ‌నిపోయే నాటికి ఆమె ఆమె తన త‌ల్లిదండ్రులు, సోదరుడి వద్దే ఉండేవారు. మిష్టి మృతితో బాలీవుడ్ విషాదంలో మునిగింది. 

హ‌రిబాబుకు అంతేనా

బీసీలు ముద్దు..కాపులు వ‌ద్దు