సమంత మొట్టమొదటిసారి కలిసిన హీరోయిన్ ఎవరు?

ఇప్పుడంటే సమంత పెద్ద హీరోయిన్. కానీ ఒకప్పుడు ఆమె కూడా ఓ సింపుల్ అమ్మాయి. స్టార్స్ ను కలవాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఆమెకు కూడా ఉండేది. మరి సమంత మొట్టమొదటిసారి కలిసిన హీరోయిన్ ఎవరు?…

ఇప్పుడంటే సమంత పెద్ద హీరోయిన్. కానీ ఒకప్పుడు ఆమె కూడా ఓ సింపుల్ అమ్మాయి. స్టార్స్ ను కలవాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఆమెకు కూడా ఉండేది. మరి సమంత మొట్టమొదటిసారి కలిసిన హీరోయిన్ ఎవరు? ఈ ప్రశ్నకు సమంతానే స్వయంగా ఆన్సర్ ఇచ్చింది.

“నా మొదటి సినిమా ఏమాయచేసావె సినిమా రిలీజైంది. నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను. అప్పటివరకు ఏ హీరోయిన్ ను కలవలేదు. నన్ను ఓ సక్సెస్ పార్టీకి తీసుకెళ్లారు. తమన్న హీరోయిన్ గా నటించిన సినిమా సక్సెస్ పార్టీ అది. నేను ఓ హీరోయిన్ ను ప్రత్యక్షంగా కలవడం అదే ఫస్ట్ టైమ్. తమన్నను చూసి అప్సరసలా ఉందని మనసులో అనుకున్నాను.”

ఆనాటి సంఘటన తనకు ఇంకా గుర్తుందని, ఆరోజు తమన్న రెడ్ డ్రెస్ లో ఉందని చెప్పుకొచ్చింది సమంత. అలా ఓ స్టార్ ను కలిశానని, ఆ తర్వాత అదే స్టార్ తమన్న తనకు ఫ్రెండ్ గా మారడం ఆశ్చర్యంగా, థ్రిల్ గా అనిపిస్తుందని చెబుతోంది సమంత.

మరోవైపు పెళ్లి తర్వాత కెరీర్ పై కూడా తన మనసులో మాట బయటపెట్టింది శామ్. అవకాశాలు రావని ఫిక్స్ అయిన తర్వాతే పెళ్లికి రెడీ అయ్యానని చెప్పుకొచ్చింది.

“నిజం చెప్పాలంటే పెళ్లి తర్వాత నేను సినిమాలు ప్లాన్ చేయలేదు. పెళ్లి తర్వాత నాకు అవకాశాలు రావని ఫిక్స్ అయ్యాను. అలా మెంటల్లీ ప్రిపేర్ అయి పెళ్లి చేసుకున్నాను. కానీ అదృష్టంకొద్దీ పెళ్లి తర్వాత కూడా అవకాశాలొచ్చాయి. పెళ్లి తర్వాత రంగస్థలం రిలీజవ్వడం, అది పెద్ద హిట్టవ్వడం నా అదృష్టం”

అప్పుడు అదృష్టం కొద్దీ ఛాన్సులు అందుకున్న సమంత.. ఇప్పుడు మాత్రం కావాలనే అవకాశాలు అందుకోవడం లేదు. ఆమె తన కెరీర్ కు చిన్న గ్యాప్ ఇచ్చింది.

అటూ ఇటూ ఎటూ కాలేక!