Advertisement

Advertisement


Home > Movies - Movie News

మెగా ముసుగులో బన్నీ-చరణ్ గుద్దులాట

మెగా ముసుగులో బన్నీ-చరణ్ గుద్దులాట

అల్లు అర్జున్ ఎప్పుడూ అంతే. తనకంటూ ప్రత్యేకంగా ఏదైనా ఉండేలా చూసుకుంటాడు. స్పందించే విషయంలో తరతమబేధాలు బాగా ఫాలో అవుతాడు. అయితే ఇవన్నీ కాంపౌండ్ ఆవల మాత్రమే. మెగా కాంపౌండ్ వరకు వచ్చేసరికి మాత్రం బన్నీ కాస్త సంయమనంతో ఉంటాడు. తామంతా ఒక్కటే అనే ఫీలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు.

నిజానికి మెగా కాంపౌండ్ నుంచి దూరంగా జరిగే ప్రక్రియను బన్నీ ఎప్పుడో మొదలుపెట్టాడు. మెగా ట్యాగ్ తనకు అవసరం లేదంటూ అల్లు అర్జున్ ఆర్మీని సొంతంగా క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఈ క్రమంలో ఎప్పుడూ మెగాహీరోలకు ఆయన వ్యతిరేకంగా మారలేదు. 'చెప్పను బ్రదర్' అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఆ తర్వాత ఓ ఘటనలో పవన్ ను ఆలింగనం చేసుకొని అంతా కూల్ చేశాడు బన్నీ.

'గ్లోబల్ స్టార్' అంటే బన్నీకి ఇష్టం లేదా..?

అయితే ఈసారి ఇష్యూ పవన్ తో కాదు. రామ్ చరణ్ తెరపైకొచ్చాడు. తాజాగా తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు చరణ్. ఆర్ఆర్ఆర్ లాంటి సక్సెస్ తర్వాత, పైగా ఆస్కార్ అవార్డులకు వెళ్లి వచ్చిన తర్వాత జరుగుతున్న పుట్టినరోజు కావడంతో.. చిరంజీవి వర్గం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒక రోజు ముందు నుంచే వేడుకలు షురూ చేయడంతో పాటు.. గ్లోబల్ స్టార్ అనే కొత్త టైటిల్ ను చరణ్ కు సక్సెస్ ఫుల్ గా ఆపాదించే ప్రయత్నం కూడా జరిగింది.

చరణ్ పుట్టినరోజుకు దేశంలోని చాలామంది ప్రముఖులు కదిలారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఈసారి బాలీవుడ్ నుంచి కూడా చరణ్ కు భారీగా శుభాకాంక్షలు అందాయి. అయితే సొంత కాంపౌండ్ మనిషి బన్నీ మాత్రం చరణ్ కు విశెష్ చెప్పలేదు. వ్యక్తిగతంగా ఫోన్ చేసి హ్యాపీ బర్త్ డే అని చెప్పి ఉండొచ్చు కానీ, ఫ్యాన్స్ కు తెలిసేలా ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్పాలి కదా. ఆ ప్రయత్నం మాత్రం జరగలేదు.

దీంతో చరణ్-బన్నీ మధ్య ఏదో జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. మెగా కాంపౌండ్ లో సాయితేజ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలంతా చెర్రీకి శుభాకాంక్షలు చెప్పారు. పవన్ కల్యాణ్ తనదైన స్టయిల్ లో ప్రెస్ నోట్ రిలీజ్ చేయగా, చివరికి అల్లుశిరీష్ కూడా శుభాకాంక్షలు చెప్పాడు. కానీ బన్నీ మాత్రం ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు.

బన్నీ అంత బిజీగా ఉన్నాడా..

నిజానికి బన్నీ ఏమంత బిజీగా లేడు. ఇంకా చెప్పాలంటే కాస్త ఫ్రీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. పైగా ఇండియాలోనే ఉన్నాడు. చరణ్ బర్త్ డే అని కూడా తెలుసు. అయినప్పటికీ ట్వీట్ వేయలేదు. దీంతో మెగా ఫ్యాన్స్, బన్నీపై ఫైర్ అవుతున్నారు. మరోవైపు రాత్రి చిరంజీవి ఇచ్చిన బర్త్ డే పార్టీకి కూడా బన్నీ హాజరవ్వలేదని తెలుస్తోంది. చిరంజీవి షేర్ చేసిన ఫొటోల్లో ఎక్కడా బన్నీ జాడ లేదు.

చరణ్ పుట్టినరోజుపై బన్నీ రియాక్ట్ అవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచే బన్నీ పేజీలో కామెంట్స్ మోత మొదలైపోయింది. ఎందుకు శుభాకాంక్షలు చెప్పడం లేదంటూ ఆరాలు ఎక్కువైపోయాయి. అయినప్పటికీ బన్నీ చలించలేదు, రియాక్ట్ అవ్వలేదు.

దెబ్బకు దెబ్బ అప్పుడే మొదలు..

అయితే బన్నీ చేసిన పనికి మెగా ఫ్యాన్స్ నుంచి వెంటనే రిటర్న్ గిప్ట్ వచ్చేసింది. కొద్దిసేపటి కిందట బన్నీ ఓ ట్వీట్ వేశాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇవాళ్టితో 20 ఏళ్లు అనేది ఆ ట్వీట్ సారాంశం. ఈ సందర్భంగా ఆయన చిరంజీవి పేరు ప్రస్తావించలేదు. బన్నీ హీరోగా ఎదగడానికి, కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి చాలా వర్క్ చేశారు. ఇంకా చెప్పాలంటే, ప్రారంభంలో బన్నీ కోసం తనే స్క్రిప్టులు వినేవారు. అలా బన్నీని హీరోను చేసిన ఘనత చిరంజీవికి దక్కుతుంది. అంతెందుకు, కెరీర్ ప్రారంభంలో బన్నీ నిలదొక్కుకోవడానికి మెగాభిమానుల అండదండలే కారణం. అలాంటి చిరంజీవి పేరును బన్నీ ఈరోజు ప్రస్తావించలేదు.

ఇటు చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల్లేవ్, అటు చిరంజీవి ప్రస్తావన లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా బన్నీపై భగ్గుమంటున్నారు. అటు చరణ్ కూడా ఈరోజు, ఇప్పటివరకు బన్నీకి ఎలాంటి శుభాకాంక్షలు తెలపలేదు. దీంతో 'మెగా విబేధాలు' మరోసారి బయటపడ్డట్టయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?