ఆ హీరోయిన్ వద్దంటున్నా వదలని టాలీవుడ్

టాలీవుడ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు ఇలియానా. చేసేది చిన్న పాత్ర అయినా బాలీవుడ్ లో మాత్రమే వర్క్ చేయాలనుకుంటుంది. ఇదే విషయాన్ని గతంలో చెప్పేసింది కూడా. కానీ టాలీవుడ్ మేకర్స్ కు మాత్రం…

టాలీవుడ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు ఇలియానా. చేసేది చిన్న పాత్ర అయినా బాలీవుడ్ లో మాత్రమే వర్క్ చేయాలనుకుంటుంది. ఇదే విషయాన్ని గతంలో చెప్పేసింది కూడా. కానీ టాలీవుడ్ మేకర్స్ కు మాత్రం ఇలియానాపై ప్రేమ చావలేదు. ఎప్పటికప్పుడు ఆమె పేరు పలవరిస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి ఈ గోవా బ్యూటీ పేరు టాలీవుడ్ లో తెరపైకొచ్చింది

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమా చేస్తున్నాడు నాగార్జున. కాజల్ ఇందులో హీరోయిన్. అయితే ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ అని, అందుకే నాగ్ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడీ స్థానంలోకి ఇలియానాను తీసుకోవాలని అనుకుంటున్నారు.

ఇలియానా స్టార్ హీరోయిన్ కాదు, తెలుగులో ఆమెకు ఎప్పుడో క్రేజ్ పోయింది. ఆమె చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ కూడా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ఇలియానా పేరు ఇలా దశలవారీగా తెలుగుతెరపైకి రావడం ఆశ్చర్యమే. మేకర్స్ మదిలో ఆమె ఇంకా నలుగుతూనే ఉందన్నమాట.

అయితే ఇలియానా పేరు ప్రస్తుతానికి ఓ ఆప్షన్ మాత్రమే. ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా పరిశీలిస్తున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. తుది నిర్ణయం మాత్రం నాగార్జునదే. అయితే ఎక్కువ అవకాశాలు మాత్రం ఇలియానాకే ఉన్నాయి. రెమ్యూనరేషన్ వరకు చర్చలు వెళ్లాయంటే, ఇలియానా దాదాపు ఫిక్స్ అయిందనే అర్థం.