క్లయిమాక్స్ లో సీక్వెల్ ప్రకటించి కట్ చేశారంట

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని, సినిమా రిజల్ట్ ను బట్టి దాన్ని ప్రకటిస్తామని, విడుదలకు ముందే విశ్వక్ సేన్ ప్రకటించాడు. మూవీ రిలీజైన మొదటి రోజే ఆ ప్రకటన చేశాడు.…

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని, సినిమా రిజల్ట్ ను బట్టి దాన్ని ప్రకటిస్తామని, విడుదలకు ముందే విశ్వక్ సేన్ ప్రకటించాడు. మూవీ రిలీజైన మొదటి రోజే ఆ ప్రకటన చేశాడు.

అయితే ఈ సీక్వెల్ కు సంబంధించి, చిన్న ట్విస్ట్ ఏదైనా క్లయిమాక్స్ లో ఉంటుందని ఆడియన్స్ ఆశించారు. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి క్లయిమాక్స్ లో అలాంటి ట్విస్ట్ ఏదీ కనిపించలేదు. దీంతో సీక్వెల్ ఉండదని చాలామంది అనుకుంటున్నారు.

దీనిపై క్లారిటీ ఇచ్చాడు విశ్వక్ సేన్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన ఈ హీరో.. సినిమాలో సీక్వెల్ కు సంబంధించి లీడ్ సీన్ పెట్టి, ఆఖరి నిమిషంలో తీసేసిన విషయాన్ని వెల్లడించాడు.

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా సీక్వెల్ కు సంబంధించి లీడ్స్ అన్నీ మా ఫోన్ లో ఉన్నాయి. నిజానికి క్లయిమాక్స్ లో ప్రకటిద్దాం అనుకున్నాం. కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే సీక్వెల్ చెప్పలేదు. సీక్వెల్-1, సీక్వెల్-2, సీక్వెల్-3 అని ఉండవు. ఈ సినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. సీక్వెల్ కోసం మరో బ్యాక్ డ్రాప్ అనుకున్నాం. అలా లొకేషన్ మారుతుంది. దానికి సంబంధించి టైటిల్ కూడా అనుకున్నాం. కానీ ఆ రైట్స్ మా దగ్గర లేవు. ఆ కారణంతో ఆఖరి నిమిషంలో డ్రాప్ చేశాం. సెపరేట్ గా ఓ ఈవెంట్ పెట్టి మరీ దాన్ని ఎనౌన్స్ చేస్తాం.”

విశ్వక్ సేన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. కృష్ణ చైతన్య డైరక్ట్ చేసిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.