Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇంటికొచ్చిన చిరంజీవి.. సినిమాలపై క్లారిటీ ఎప్పుడు?

ఇంటికొచ్చిన చిరంజీవి.. సినిమాలపై క్లారిటీ ఎప్పుడు?

ఆచార్య ఇలా రిలీజైందో లేదో చిరంజీవి విదేశాలకు వెళ్లారు. అలా చాన్నాళ్ల పాటు విదేశాల్లో ఉండిపోయిన చిరు, మళ్లీ తిరిగొచ్చారు. ఇప్పుడు అసలైన చర్చ మొదలైంది. ఆయన సిటీలో లేనప్పుడు ఆయన సినిమాలపై చాలా ఊహాగానాలు చెలరేగాయి. ఇప్పుడాయన తిరిగొచ్చారు, మరి ఆయన సినిమాలపై క్లారిటీ ఇస్తారా?

చిరంజీవి లైనప్ కు సంబంధించి అన్నింటికంటే బాగా వైరల్ అయిన ఊహాగానం వెంకీ కుడుముల సినిమా. చిరు హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆచార్య ఎఫెక్ట్ తో ఆ సినిమా ఆగిపోయిందనే ప్రచారం ఓ రేంజ్ లో జరిగింది. దీనిపై కుడుముల క్లారిటీ ఇవ్వలేదు. అంత సీన్ తనకు లేదని ఆఫ్ ది రికార్డ్ చెప్పేశాడు. సో... ఇప్పుడీ సినిమా ఉందా లేదా అనే విషయాన్ని చిరంజీవి వెల్లడించాల్సిన అవసరం ఉంది.

ఇక చిరంజీవి నుంచి క్లారిటీ రావాల్సిన మరో అంశం భోళాశంకర్. ప్రస్తుతం సెట్స్ పై ఉంది ఈ సినిమా. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు భారీగా మార్పుచేర్పులు చేయాలని చిరంజీవి ఆదేశించారట. ఇలా సూచించి, అలా విదేశాలకు వెళ్లారనేది టాక్. మరి ఈ సినిమా సంగతేంటి? మెహర్ రమేష్ ఆ పనిలోనే ఉన్నాడా? లేక చిరంజీవి వస్తే మరో షెడ్యూల్ ప్రారంభించే పని మీద ఉన్నాడా?

ఇక చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాపై కూడా చిన్నపాటి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సో.. ఆచార్య దెబ్బ నుంచి ఇది తప్పించుకున్నట్టే. అయితే గాడ్ ఫాదర్ పై ఆచార్య ఎఫెక్ట్ మరో రూపంలో పడింది. లెక్కప్రకారం, ఈ పాటికి గాడ్ ఫాదర్ విడుదల తేదీని ప్రకటించాలి. కానీ ఆచార్య ఫ్లాప్ తో గాడ్ ఫాదర్ విడుదలకు లాంగ్ గ్యాప్ ఇవ్వాలని చిరంజీవి అనుకుంటున్నట్టు కథనాలు వచ్చాయి. వీటిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

ఇలా చిరంజీవికి సంబంధించి ప్రతి సినిమాపై ఓ అపోహ/పుకారు ప్రచారంలో ఉంది. చిరు రాకతో వీటన్నింటిపై ఓ క్లారిటీ వస్తుందని మెగాభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?