ఆ హీరోకు నిజమైన దీపావళి వస్తుందా?

వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై వాదనలు మరోసారి వాయిదా పడ్డాయి. బెంగళూరు కోర్టులో చుక్కెదురు కావడంతో, హైకోర్టును ఆశ్రయించగా..…

వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై వాదనలు మరోసారి వాయిదా పడ్డాయి. బెంగళూరు కోర్టులో చుక్కెదురు కావడంతో, హైకోర్టును ఆశ్రయించగా.. ఈ కేసును 28వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. దీంతో దీపావళికి ముందు దర్శన్ కు బెయిల్ పక్కా అంటున్నారు.

కింది కోర్టులో దర్శన్ తరఫు లాయర్ల వాదనతో జడ్జి ఏకీభవించలేదు. దీంతో హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. ఈసారి దర్శన్ ఆరోగ్య పరిస్థితిని కూడా చేర్చారు. ఆయన తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారని, మెరుగైన చికిత్స కోసం ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వాలని కోరారు.

దీనిపై స్పందించిన కోర్టు, దర్శన్ ఆరోగ్య స్థితిపై పూర్తిస్థాయి నివేదిక కోరింది. దీని కోసం దర్శన్ ను రాత్రి హుటాహుటిన జైలు నుంచి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆయన వెన్నెముకకు స్కానింగ్ తీశారు. ఆ నివేదికను కోర్టుకు సమర్పించబోతున్నారు జైలు అధికారులు. స్కానింగ్ పూర్తిచేసుకొని తిరిగి జైలుకు వెళ్తున్న క్రమంలో దర్శన్ ఆగ్రహానికి గురయ్యాడు. ఓ అభిమాని దర్శన్ చేయి పట్టుకొని లాగడంతో హీరోకు కోపం వచ్చింది.

రేణుకా స్వామి మర్డర్ కేసుకు సంబంధించి సాక్ష్యుల విచారణ, ఆధారాల సేకరణ మొత్తం పూర్తయింది కాబట్టి దర్శన్ కు బెయిల్ ఇవ్వాలని లాయర్లు కింది కోర్టులో విజ్ఞప్తి చేశారు. సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని, కేసు కూడా కీలక దశలో ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వలేమని కోర్టు చెప్పడంతో, ఆ వెంటనే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు.

మరోవైపు తనను బళ్లారి జైలు నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు మార్చాలంటూ దర్శన్ చేసిన విజ్ఞప్తిని కూడా కోర్టు పెండింగ్ లో పెట్టింది.

One Reply to “ఆ హీరోకు నిజమైన దీపావళి వస్తుందా?”

Comments are closed.