Advertisement

Advertisement


Home > Movies - Movie News

లవ్ స్టోరీ వచ్చింది.. మరి ఆర్ఆర్ఆర్ ఏమౌతుంది?

లవ్ స్టోరీ వచ్చింది.. మరి ఆర్ఆర్ఆర్ ఏమౌతుంది?

లవ్ స్టోరీ సినిమా ఇండస్ట్రీలో ఆశలు రేపిందనేది నిజం. కళ్లముందు కనిపిస్తున్న వాస్తవం. వారం ముందు నుంచే ఈ సినిమాకు జోరుగా అడ్వాన్స్ బుకింగ్ జరిగిందంటే, బజ్ ఉన్న సినిమా కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారని అర్థం. మరి ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న ఆర్ఆర్ఆర్ యూనిట్ ఏం చేయబోతోంది? ఇప్పటికైనా రాజమౌళి తన సినిమాను బయటకు తెస్తాడా? కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాడా?

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది ఆర్ఆర్ఆర్ సినిమా. వచ్చేనెల కూడా ఈ సినిమా రావడం లేదని తాజాగా ప్రకటించారు. వరల్డ్ సినిమా మార్కెట్ కుదుటపడిన తర్వాత రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామని కూడా అప్పుడు చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు దాదాపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు అనుకూలంగానే ఉన్నాయి. లవ్ స్టోరీ సినిమా విడుదలై ఆర్ఆర్ఆర్ తో పాటు ఎన్నో పెద్ద సినిమాలకు భరోసా ఇచ్చింది. ఓవర్సీస్ లో కూడా మార్కెట్ ఓ మోస్తరుగా గాడిన పడింది.

అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలనుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి 7కి సినిమాను దింపాలనేది ప్లాన్. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ నుంచి కూడా రాజమౌళి పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఆల్రెడీ బరిలో ఉన్న స్టార్ హీరోలకు నచ్చజెప్పి, బతిమాలి, కిందామీద పడి ఎనర్జీ వేస్ట్ చేసుకునే కంటే తమ సినిమాను మరో బెటర్ డేట్ కు విడుదల చేయడం మంచిదని రాజమౌళి భావిస్తున్నాడు. ఈ మేరకు సంక్రాంతి నుంచి ఆర్ఆర్ఆర్ దాదాపు తప్పుకుంది.

సంక్రాంతికి రావడం లేదని అంతర్గతంగా నిర్థారించుకున్న యూనిట్, ఆ వెంటనే ప్రచారాన్ని ఆపేసింది. దోస్తీ సాంగ్ తో ఆర్ఆర్ఆర్ ప్రచారం ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు కొత్త రిలీజ్ డేట్ లాక్ అయితే, అప్పుడు ఫ్రెష్ గా ప్రచారం స్టార్ట్ చేస్తారు. ఈలోగా ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కొత్త సినిమాలు మొదలుపెడతారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?