తక్కువ మాట్లాడతా.. ఎక్కువ సినిమాలు చేస్తా

తన కెరీర్ కు సంబంధించి కీలక ప్రకటన చేశాడు ప్రభాస్. ఇకపై తన నుంచి ఏడాదికి కనీసం 2 సినిమాలు వస్తాయని క్లారిటీ ఇచ్చాడు. తను స్టేజ్ పై తక్కువ మాట్లాడతానని, ఎక్కువ సినిమాలు…

తన కెరీర్ కు సంబంధించి కీలక ప్రకటన చేశాడు ప్రభాస్. ఇకపై తన నుంచి ఏడాదికి కనీసం 2 సినిమాలు వస్తాయని క్లారిటీ ఇచ్చాడు. తను స్టేజ్ పై తక్కువ మాట్లాడతానని, ఎక్కువ సినిమాలు చేస్తానని ఫ్యాన్స్ కు మాటిచ్చాడు.

“సాధారణంగా కంటే ఎక్కువగానే మాట్లాడాను, రెగ్యులర్ గా చేసే సినిమాల కంటే ఎక్కువగానే చేస్తున్నాను. సంవత్సరానికి 2 సినిమాలు చేస్తాను. కొంచెం కొంచెం మాట్లాడతా, ఏడాదికి 2 సినిమాలు చేస్తాను. ఒక్కోసారి ఏడాదికి 3 సినిమాలు కూడా రావొచ్చు.  సో.. స్టేజ్ మీద తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తాను.”

తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఈ మేరకు ప్రకటన చేశాడు ప్రభాస్. తను మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తానని, విడుదల ఆలస్యమైతే మాత్రం తనకు సంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చాడు

ప్రస్తుతం ప్రభాస్ అదే పనిలో ఉన్నాడు. ఆదిపురుష్ ను విడుదలకు సిద్ధం చేసిన ఈ హీరో, సలార్ ను కూడా దాదాపు కంప్లీట్ చేశాడు. మరోవైపు మారుతి దర్శకత్వంలో సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు. అటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె కూడా రెడీ అవుతోంది. లిస్ట్ లో స్పిరిట్ అనే మూవీ కూడా ఉంది. సో.. ఇకపై ప్రభాస్ నుంచి ఏడాదికి 2 సినిమాలు గ్యారెంటీ.