స్టార్ యాంకర్ శ్రీముఖి పెళ్లిపై వచ్చిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. గడిచిన రెండేళ్లుగా ఆమె పెళ్లిపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. కొన్నింటిని ఆమె ఖండించింది, మరికొన్నింటిని లైట్ తీసుకుంది.
ఇప్పుడు మరోసారి ఈ యాంకర్ పై వెడ్డింగ్ రూమర్స్ గుప్పుమంటున్నాయి. అయితే ఈసారి మాత్రం ఈ టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా శ్రీముఖి సన్నిహితుల నుంచి ఈ 'పెళ్లి మేటర్' బయటకొచ్చింది.
ఓ బిగ్ షాట్ తో శ్రీముఖి డేటింగ్ చేస్తోందట. ఆ రిచ్ బిజినెస్ మేన్ ను ఈమె పెళ్లాడనుందంట. రీసెంట్ గా ఇద్దరూ పెళ్లిపై ఓ అవగాహనకు వచ్చారట. ఈ పెళ్లికి సదరు రిచ్ కిడ్ తల్లిదండ్రుల నుంచి కూడా అనుమతి వచ్చిందని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది శ్రీముఖి. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెడుతుంది, తన కొత్త ఫొటోషూట్ స్టిల్స్ షేర్ చేస్తుంది. రకరకాల ఫన్నీ వీడియోస్ పోస్ట్ చేస్తుంది. అదే హంగామాలో భాగంగా ఈ పెళ్లి పుకారుపై కూడా ఆమె క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
అయితే చాలామంది మాత్రం శ్రీముఖి, తన సోషల్ మీడియా వేదికగా పెళ్లి కబురు మోసుకొస్తుందని ఎదురుచూస్తున్నారు.