రాంగ్ టైమ్ లో బన్నీ ట్వీట్ లు

ఒకపక్క #megastarkalyanram అంటూ దాదాపు పదివేల ట్వీట్ లు. మండిపోతున్న మెగా ఫ్యాన్స్. అలాంటి టైమ్ హీరో బన్నీ నుంచి అన్ని వయస్సుల వారు చూసి ఆనందించదగ్గ చిత్రం బింబిసార అంటూ ట్వీట్ రెండు…

ఒకపక్క #megastarkalyanram అంటూ దాదాపు పదివేల ట్వీట్ లు. మండిపోతున్న మెగా ఫ్యాన్స్. అలాంటి టైమ్ హీరో బన్నీ నుంచి అన్ని వయస్సుల వారు చూసి ఆనందించదగ్గ చిత్రం బింబిసార అంటూ ట్వీట్ రెండు ట్వీట్ లు. దీన్ని ఎలా చూడాలి? కో ఇన్సిడెంట్ అనేనా. 

నందమూరి ఫ్యాన్స్ కు మెగా ఫ్యాన్స్ కు ఉప్పు నిప్పు లా వుంటుందని తెలిసిందే. మొన్నటి నుంచి మెగా ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. హ్యాష్ ట్యాగ్ హడావుడితో.

ఇప్పుడు బన్నీ ట్వీట్ లు వారి గాయం మీద కారం చల్లినట్లు అవుతోంది. బన్నీ మంచి ఉద్దేశంతోనే అలాగే దర్శకుడు వేణు మల్లిడి (వశిష్ట) మీద అభిమానంతోనొ, అతని తండ్రి మల్లిడి సత్యనారాయణ రెడ్డితో వున్న అనుబంధంతోనో ఈ ట్వీట్ వేసి వుండొచ్చు. కానీ రాంగ్ టైమ్ ఇది. 

మెగాస్టార్ -మెగా పవర్ స్టార్ కు బన్నీకి మధ్య దూరం వుందనే ప్రచారం వుండనే వుంది. బాలయ్య సినిమా ఫంక్షన్ కు బన్నీ హాజ‌రయినపుడు ఇది మరి కాస్త పెరిగింది. ఇప్పుడు అది మరి కొంచెం పెరగడం పక్కా.