‘యశోద’ స్క్రిప్ట్ సర్‌ప్రైజ్ చేసింది : వరలక్ష్మి

సరోగసీ నేపథ్యంలో హీరోయిన్ సమంత నటించిన సినిమా 'యశోద'. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్‌ది కీ రోల్. ట్రైలర్‌లో సరోగసీ ఫెసిలిటీ సెంటర్‌ రన్ చేసే మహిళగా, రిచ్ పర్సన్‌గా ఆమె కనిపిస్తున్నారు. …

సరోగసీ నేపథ్యంలో హీరోయిన్ సమంత నటించిన సినిమా 'యశోద'. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్‌ది కీ రోల్. ట్రైలర్‌లో సరోగసీ ఫెసిలిటీ సెంటర్‌ రన్ చేసే మహిళగా, రిచ్ పర్సన్‌గా ఆమె కనిపిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో వరలక్ష్మి మీడియాతో మాట్లాడారు. 'యశోద'లో సరోగసీ మెయిన్ టాపిక్ కాదని, దాని చుట్టూ దర్శకులు హరి – హరీష్ చక్కటి కథనంతో కూడిన కథ రాశారని వరలక్ష్మి చెప్పారు. ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు.  తాను సినిమాలో కాస్త గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ చేసినట్టు వరలక్ష్మి కన్ఫర్మ్ చేసారు. ట్రైలర్‌లో తన క్యారెక్టర్ కామ్‌గా ఉన్నట్టు చూపించినా, కథ ముందుకు వెళ్తున్న కొలదీ ఆమె క్యారెక్టర్ డెప్త్ తెలుస్తుందట. 

సమంతతో పాటు తన కథ కూడా ప్యారలల్‌గా రన్ అవుతుందని, ఇద్దరు కథలు ఎలా కలిశాయన్నది ఆసక్తికరమని వరలక్ష్మి వివరించారు. సినిమాలో కథే హీరో అని, అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ ఖర్చుకు వెనుకాకుండా సెట్స్ రూపొందించగా… సినిమాటోగ్రాఫర్ అంతే అందంగా తెరకెక్కించారని చెప్పారు. విజువల్ క్వాలిటీ, బెస్ట్ మ్యూజిక్ – టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంటుందన్నారు. ఆడియన్స్ మనీకి వేల్యూఇచ్చే కంటెంట్ ఉందన్నారు.    

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన 'యశోద' తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 11న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. 'క్రాక్' తర్వాత తనకు తెలుగు నుంచి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని వరలక్ష్మి చెప్పింది. 'క్రాక్' దర్శకుడు గోపీచంద్ మలినేని తీస్తున్న తాజా సినిమా బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి'లో ఆమె నటిస్తోంది. మెయిన్ లీడ్‌గా 'శబరి' సినిమా కూడా ఉందని చెప్పింది.