టాలీవుడ్ కు కొత్త టెన్షన్ వచ్చి పడింది. అది యస్ బ్యాంక్ రూపంలో. రిజర్వ్ బ్యాంక్ యస్ బ్యాంక్ మీద మారిటోరియం విధించింది. నెల రోజుల పాటు బ్యాంకుల్లోని తమ ఖాతాల నుంచి యాభై వేలకు మించి డ్రా చేయడానికి వీలు లేదు. లక్షలు వుండొచ్చు. కోట్లు వుండొచ్చు. డ్రా చేయగలిగింది మాత్రం యాభై వేలు మాత్రమే.
ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సంస్థలకు యస్ బ్యాంక్ లో అక్కౌంట్లు వున్నాయని తెలుస్తోంది. సాధారణంగా అన్ని సంస్థలకు ఒకటికి మించిన బ్యాంకుల్లో అక్కౌంట్లు వుంటాయి. ఎందుకంటే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం వాడుకుంటారు. లోన్ లు వాడుకుంటారు. అందువల్ల రకరకాల బ్యాంకుల్లో అక్కౌంట్లు వుంటాయి.
అయితే యస్ బ్యాంకుల్లో అకౌంట్ వున్నవారు, అందులో వర్కింగ్ క్యాపిటల్ వున్నా కూడా ఇప్పుడు డ్రా చేసుకోవడానికి వీలు కాదు. ఇండస్ట్రీలో నిర్మాతలకు ఎక్కువగా యాక్సిస్ బ్యాంక్ లో అక్కౌంట్లు వుంటాయి. ఇక మిగిలిన బ్యాంక్ ల్లో కూడా అకౌంట్లు వుంటాయి. సురేష్ మూవీస్, గీతా, దిల్ రాజు ఇలా చాలా పెద్ద సంస్థలకు అందరికీ యస్ బ్యాంక్ లో ప్రైమరీ అకౌంట్లో, సెకండరీ అక్కౌంట్లో వున్నాయని తెలుస్తోంది.
ఇవన్నీ ఓడి అక్కౌంట్లు అయితే సమస్య ఏమీ లేదు. వాళ్ల డబ్బులే వీళ్ల దగ్గర వున్నట్లు లెక్క. అలా కాకుండా వీళ్ల డబ్బులు ఆయా అక్కౌంట్లలో వుంటే మాత్రం కాస్త ఇబ్బందే.