Advertisement

Advertisement


Home > Movies - Movie News

అనుభవం కార్డు వైసీపీకి ప్లస్ అవుతుందా?

అనుభవం కార్డు వైసీపీకి ప్లస్ అవుతుందా?

విశాఖ పార్లమెంట్ సీటులో రాజకీయంగా తలపండిన మాజీ ఎంపీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన బొత్స ఝాన్సీ లక్ష్మి ఈసారి పోటీకి దిగుతున్నారు. ఆమె పక్కా లోకల్ కార్డు తో పాటు బీసీ మహిళ అన్న మరో   కార్డు తో  రంగంలో ఉన్నారు. ఇపుడు దానికి మరో  కార్డు ని వైసీపీ యాడ్ చేసింది. అదే ఆమె రాజకీయ అనుభవం. ఎంపీగా ఆమె పనితనం.

ఆమె గతంలో బొబ్బిలి, విజయనగరం నుంచి ఎంపీగా పనిచేసినపుడు విశాఖ సమస్యలను కూడా పార్లమెంట్ లో ప్రస్తావించాను అని ప్రచారంలో చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి పట్ల తనకు ఒక విజన్ ఉందని ఆమె అంటున్నారు   ఈసారి విశాఖ ఎంపీగా గెలిస్తే తాను అయిదేళ్లలో విశాఖ సిటీని అద్భుతంగా అభివృద్ధి చేస్తాను అని చెబుతున్నారు.

తన రాజకీయ అనుభవంతో పాటు తన విద్యార్హతలను ఆమె ప్రస్తావిస్తున్నారు. డబుల్ పీహెచ్ డీ చేసిన బొత్స ఝాన్సీ లక్ష్మి తాను పుట్టిన విశాఖ తనకే ఓటు వేస్తుందని బలంగా నమ్ముతున్నారు. తనకంటే విశాఖ సమస్యల గురించి ఎవరికీ తెలుసు అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ నేతలు అయితే మహిళా ఎంపీని ఈసారి ఎంపీగా పార్లమెంట్ కి పంపించాలని కోరుతున్నారు. వలసవాదులకు ఈసారి చెక్ పెట్టాలని కోరుతున్నారు. మన విశాఖ మన ఎంపీ అంటూ కొత్త నినాదం ఇస్తున్నారు. ఇవన్నీ వైసీపీ ఆయుధాలుగా ఉంటే టీడీపీ కూటమి నుంచి పోటీలో ఉన్న బాలయ్య చిన్నలుడు శ్రీ భరత్ తాను కూడా విశాఖ వాసినే అంటున్నారు. తాను విశాఖలో విద్యా సంస్థలు పెట్టి అభివృద్ధి చేశాను అని చెబుతున్నారు. తాను యువ నాయకత్వం అందిస్తాను అంటున్నారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో సమస్యల మీద తనకు పూర్తిగా అవగాహన ఉందని అంటున్నారు.

కొత్త తరం ఆలోచనలతో విశాఖ ప్రగతికి కృషి చేస్తామని ఆయన అంటున్నారు. ఇక్కడ పోటీ ప్రధానంగా వైసీపీ టీడీపీ కూటమి మధ్యన ఉంది. అనుభవం వర్సెస్ కొత్త తరంగా ఈ పోరు మారుతోంది. అలాగే బీసీ వర్సెస్ ఓసీ అని కూడా అంటున్నారు. సీనియర్ రాజకీయం తో వర్ధమాన రాజకీయం పోరుగా పేర్కొంటున్నారు. మహిళకు ఈసారి చాన్స్ ఇవ్వాలని వైసీపీ అంటూంటే యువతరానికి చాన్స్ అంటోంది టీడీపీ కూటమి. జనాలు ఎవరి వైపు ఉంటారు. ఏ తీర్పు ఇస్తారు అన్నది చూడాల్సి ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?