Advertisement

Advertisement


Home > Movies - Photo Feature

రిషి కాదు.. ఇతడు మహర్షి

రిషి కాదు.. ఇతడు మహర్షి

మహేష్ బాబు కొత్త సినిమాకు రిషి అనే పేరు పెట్టబోతున్నట్టు చాలా కథనాలు వచ్చాయి. అందుకే తగ్గట్టే ఇంగ్లిష్ అక్షరాలతో ఫస్ట్ లుక్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. ఆ అక్షరాలన్నీ కలిపితే రిషి అయింది. దీంతో టైటిల్ ఇదే అనుకున్నారంతా. కానీ మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ఇది కాదు. ఈ సినిమాకు మహర్షి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రిషి అనేది అతడి పాత్ర పేరు. 

మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అతడి కొత్త సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ఎనౌన్స్ చేశారు. మహర్షి సినిమాలో రిషిగా మహేష్ బాబు సరికొత్తగా కనిపిస్తున్నాడు. జుట్టు పైకి దువ్వాడు, చిన్న గడ్డం పెంచాడు. హాఫ్-షర్ట్ వేసుకొని, చేతిలో ల్యాప్ టాప్ పట్టుకొని కాలేజ్ స్టూడెంట్ లా కాస్త రఫ్ గా, మరింత స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు. 

మరికాసేపట్లో మహర్షి సినిమాకు సంబంధించి టీజర్ కూడా విడుదల చేయబోతున్నారు. సరిగ్గా 9 గంటల 9 నిమిషాలకు మహర్షి టీజర్ రాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 

దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. సమ్మర్ ఎట్రాక్షన్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న మహర్షి సినిమా థియేటర్లలోకి రానుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?