ఇక్కడ మేటర్ ఆంధ్రా-తెలంగాణ కాదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ హీరో, అదే యాసలో మాట్లాడే ఓ హీరో కాకినాడ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం చెప్పుకోదగ్గ విశేషం. అదే డియర్ కామ్రేడ్ సినిమా. రీసెంట్ గా సెట్స్ పైకొచ్చిన ఈ సినిమాపై చాలా అనుమానాలున్నాయి. వాటిలో కొన్నింటిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా తొండంగి అనే గ్రామంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇది పూర్తిగా కాకినాడ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. కాకినాడలోని ఓ కాలేజీలో స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడు విజయ్ దేవరకొండ. అదే కాలేజీలో క్రికెటర్ గా కనిపించబోతోంది హీరోయిన్ రష్మిక. వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణంతో పాటు కాలేజ్ రాజకీయాలు ఈ సినిమాలో హైలెట్ అంశాలు.
హీరోను కాస్త రెబల్ గా చూపించే ఉద్దేశంతోనే కమ్యూనిస్ట్ బ్యాక్ డ్రాప్ ను, సెట్ లో కొంతమంది కమ్యూనిస్టుల ఫొటోల్ని వాడుకుంటున్నామని మేకర్స్ స్పష్టంచేశారు. అంతేతప్ప, తమ సినిమాలో కమ్యూనిస్టు భావజాలం కనిపించదని చెబుతున్నారు. సినిమా షూటింగ్ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలోనే చేయబోతున్నారు.
అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డైలాగ్స్ పైనే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. గోదావరి యాసలో, మరీ ముఖ్యంగా ఈస్ట్ గోదావరి యాసలో దేవరకొండ డైలాగ్స్ చెప్పగలడా అనేది సందేహం. ఎందుకంటే, మహానటి సినిమాలో చిన్న పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ.. తన డైలాగ్ డెలివరీని మార్చుకోలేకపోయాడు.
సినిమా మొత్తానికి అతడి పాత్రే కాస్త తేడాకొట్టింది. అలాంటిది ఇప్పుడు డియర్ కామ్రేడ్ లో సినిమా మొత్తం గోదావరి యాసలో మాట్లాడాల్సిన పరిస్థితి.