Advertisement

Advertisement


Home > Movies - Press Releases

ఫిబ్రవరి 26న 'అక్షర'

ఫిబ్రవరి 26న 'అక్షర'

నందితశ్వేతా లీడ్ రోల్ లో నటించిన చిత్రం 'అక్షర'. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతుంది..

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ: మా "అక్షర" సినిమాను ఫిబ్రవరి 26న రిలీజ్ చేస్తున్నాం.  సోషల్ మెసేజ్‌ తో కూడిన కామెడీ థ్రిల్లర్ గా మా 'అక్షర' మూవీ రూపొందింది . ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజ‌ర్,సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు ఆఫర్లు వచ్చాయి కానీ ఈ సినిమాను థియేటర్లలోనే ఎక్స్ పీరియన్స్ చేయాలని ఇప్పటివరకు వెయిట్ చేశాం.ఇప్పటికే సగం బిజినెస్ అయిపోయింది.

ఇంకా మంచి ఆఫర్ లు వస్తున్నాయి  ఎంటర్ టైన్మెంట్ ఎక్కడా మిస్ అవకుండా ఓ బర్నింగ్ ఇష్యూని ఈ సినిమాలో చర్చించబోతున్నాం.ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది'' అన్నారు.

నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ,  రచన - దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.

నువ్వు ఒడిపోతే పార్టీ మూసివేస్తావా !

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?