ఏకే రీమేక్ కు శ్రీకారం

అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కు శ్రీకారం చుట్టేసారు. ఈ రోజు నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో అయిదారురోజుల పాటు ఓ షెడ్యూలు ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల లో ఓ ఫైట్ కొన్ని సీన్లు చిత్రీకరిస్తారు.…

అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కు శ్రీకారం చుట్టేసారు. ఈ రోజు నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో అయిదారురోజుల పాటు ఓ షెడ్యూలు ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల లో ఓ ఫైట్ కొన్ని సీన్లు చిత్రీకరిస్తారు.

పవన్ కళ్యాణ్ మీద భారీ ఫైట్ ను డిజైన్ చేసారు. ఈ ఫైట్ కోసం గత కొన్ని రోజులుగా భారీగా రిహార్సల్స్ చేస్తున్నారు. పవన్ 26 నుంచి సెట్ కు వస్తారు. వాస్తవానికి ఈ షెడ్యూలు తరువాత కేరళ వెళ్లి మొత్తం సినిమా చేసుకుని రావాలని ప్లాన్ చేసారు.

కానీ అది మార్చి, మొత్తం సెట్ లు వేసి ఇక్కడే పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం పవన్ ఇంటిసెట్, పోలీస్ స్టేషన్ సెట్, రానా ఇంటి సెట్, లాడ్జి సెట్ లు రూపుదిద్దుకుంటున్నాయి.

స్క్రీన్ ప్లే, మాటలు, తెరవెనుక ప్లానింగ్, త్రివిక్రమ్ నే. సాగర్ దర్శకుడు. సాయిపల్లవి, ఐశ్యర్య రాజేష్, రానా, మురళీశర్మ, బ్రహ్మాజీ తదితరులు నటించే ఈ సినిమాకు నిర్మాత నాగవంశీ.

నువ్వు ఒడిపోతే పార్టీ మూసివేస్తావా !

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?