cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: క్రాక్‍

సినిమా రివ్యూ: క్రాక్‍

సమీక్ష: క్రాక్‍
రేటింగ్‍: 2.75/5
బ్యానర్‍:
సరస్వతి ఫిలిం డివిజన్‍
తారాగణం: రవితేజ, శృతిహాసన్‍, సముద్రఖని, వరలక్ష్మి శరత్‍కుమార్‍, సుధాకర్‍, వంశీ, రవి శంకర్‍, సప్తగిరి తదితరులు
మాటలు: సాయి మాధవ్‍ బుర్ర
సంగీతం: తమన్‍
కూర్పు: నవీన్‍ నూలి
ఛాయాగ్రహణం: జి.కె. విష్ణు
నిర్మాత: బి. మధు
కథ, కథనం, దర్శకత్వం: గోపిచంద్‍ మలినేని
విడుదల తేదీ: జనవరి 09, 2020

మాస్‍ ఆడియన్స్కి నచ్చే సినిమా తీయాలనేది మెయిన్‍ టార్గెట్‍ అనేది అర్థమవుతున్నప్పటికీ ప్రెజెంటేషన్‍లో కొత్తదనం కోసం చేసిన ప్రయత్నమయితే ‘క్రాక్‍’లో కనిపిస్తుంది. మావిడికాయలో మేకు గుచ్చి, ఒక యాభై రూపాయల నోటుపై దానిని పెట్టి... కథ మొదలు పెట్టినపుడు మిక్స్డ్‍ ఫీలింగ్స్ వస్తాయి. ఒక విధమైన వియర్డ్ ఇంట్రెస్ట్ పుట్టినా కానీ వాటిని కథలోకి లింక్‍ చేసిన విధానాన్ని చూసే ప్రేక్షకులలో రెండు రకాలుంటారు. ఒక వర్గం దానిని చాలా సిల్లీ స్టఫ్‍గా తీసి పారేస్తే, మరొక వర్గం దాన్నంత సీరియస్‍గా తీసుకోరు. ఈ రెండవ వర్గం కోసమే అచ్చంగా తీసిన సినిమా ఇది. 

అసలు ఈ కథను ఎక్కడ మొదలు పెట్టాలో, హీరోని డైరెక్ట్గా యాక్షన్‍లోకి దించాలో లేక కాసేపు కామెడీ చేయించాలో తెలియని అయోమయం, గందరగోళం అయితే ఆరంభ సన్నివేశాల్లో కనిపిస్తూనే వుంటుంది. అవడానికి ‘క్రాక్‍’ మనిషి అని హీరో గురించి అందరూ చెప్పుకుంటూ వుంటారు. అందుకు సంబంధించి బోలెడు ఉదాహరణలు... అవి చెప్పిన ప్రతిసారీ రవితేజకి మళ్లీ ఇంట్రడక్షన్‍ రేంజ్‍ ఎంట్రీలు. ఫస్ట్ హాఫ్‍లో చాలా సీన్స్కి రవితేజ కనిపించిన ప్రతిసారీ అతని టైటిల్‍ కార్డ్ వేసేసినా పెద్ద ఫరక్‍ పడదు. 

గోపిచంద్‍ మలినేని ఏదో కొత్తదనం చూపించడానికి చేసిన ప్రయత్నాలు తెలుస్తాయి. ముందుగా చెప్పిన యాభై రూపాయల మేకు మామిడికి తోడు... వేటపాలెం బ్యాచ్‍ ఒకటి బీచ్‍లో ఇసుకలోంచి బయటకు వచ్చి... గాడిద రక్తం తాగేసి అరగడం కోసం అటు ఇటు పరుగెడతారు. అదెంత అబ్బర్డ్ అనిపించినా కానీ ఒక కెజిఎఫ్‍, ఒక ఖాకీ మాదిరిగా ఏదో చేయాలనే తపన అయితే కనబడుతుంది. కానీ అలాంటి వాటికంటే హీరో ఏదైనా ఇన్వెస్టిగేషన్‍ మొదలు పెట్టినపుడు ఏదయినా తెలివి తేటలు చూపించి ప్రేక్షకులను మేథస్సుతో ఆకట్టుకుని వుంటే బాగుండేది. 

ఉదాహరణకు ఇస్త్రీ బట్టలు తీసుకెళుతున్న మహిళ చేతిలోంచి జారి పడ్డ బట్టల్లో బురఖా జారి పడడం చూసి హీరో వెళ్లి ఒక టెర్రరిస్టుని పట్టేస్తాడు. ఆ హోల్‍ సీక్వెన్స్ చూసి సిల్లీ అనిపించకపోతే మీరే ఈ చిత్రానికి ప్రైమరీ టార్గెట్‍ ఆడియన్స్ అన్నట్టు. అలాగే మెయిన్‍ విలన్‍ దగ్గరకు హీరో వెళ్లడానికి కారణమయ్యే సీన్లో గోడ మీదనుంచి జారిపడ్డ ఏళ్ల నాటి కేస్‍ ఫైల్‍లోని పేపర్‍ ఎంత కన్వీనియంట్‍గా సీన్స్ రాసుకున్నారనే దానికో ఎగ్జాంపుల్‍.

ఆరంభంలో రవితేజను కామెడీగా సరదా మోడ్‍లో చూపించడం కోసం ఫ్యామిలీ సీన్స్ తెగ పెట్టేసారు కానీ అవేమీ వర్కవుట్‍ కాకపోగా విసిగిస్తాయి. ఫైనల్‍గా ఇంటర్వెల్‍ సీన్లో సముద్రఖనికి రవితేజ ఎదురెళ్లినపుడు చలనం వస్తుంది. పోస్ట్ ఇంటర్వెల్‍లో కూడా ఆ మూడ్‍ అలాగే కంటిన్యూ అయ్యేట్టు చూసుకోవడం, కామెడీతో డైల్యూట్‍ చేయకపోవడం టార్గెట్‍ ఆడియన్స్ని రీచ్‍ అవడానికి హెల్ప్ అవుతాయి. ఫస్ట్ హాఫ్‍లో కామెడీ కోసం పడిన ప్రయాస లేకపోవడంతో ఒక మూడ్‍ మెయింటైన్‍ అవుతుంది. అయితే ఈ క్రమంలో ఫైట్‍ తర్వాత ఫైట్‍ అన్నట్టుగా ఓవర్‍ డోస్‍ అయిపోయాయి. 

ఇంటర్వెల్‍ సీన్లో టెంపుల్‍ ఫైట్‍, బస్టాండ్‍లో ఫైట్‍ ఈ సినిమాకు హైలైట్‍గా నిలిచాయి. పాటల్లో చాలా వరకు హుషారయినవే వుండడం మరో అడ్వాంటేజ్‍. ఇక మాస్‍ సన్నివేశాల్లో అన్నీ అలరించకపోయినా, కొన్నయితే ఆ అభిరుచి వున్న ప్రేక్షకులను మెప్పిస్తాయి. పతాక సన్నివేశాలను డిఫరెంట్‍గా ప్లాన్‍ చేయడం కూడా బాగుంది. రవితేజ ఇటీవల చేసిన సినిమాలతో పోలిస్తే చాలా బెటరనిపించవచ్చు. 

రవితేజ చాలా కాలం తర్వాత తాను చేస్తోన్న క్యారెక్టర్‍ను ఎంజాయ్‍ చేస్తున్నట్టు కనిపించాడు. లీడ్‍ యాక్టర్‍ అలా కనక్ట్ అయితే అవుట్‍పుట్‍పై ఆ ఇంపాక్ట్ వుంటుంది. శృతిహాసన్‍ ఛార్మ్ కోల్పోయింది. ఆమె ఎంత అసహజంగా కనిపించిందంటే ఒక ఎలివేషన్‍ సీన్‍లో కూడా చాలా ఆడ్‍ అనిపించింది. సముద్రఖని పాత్రను విపరీతమైన బిల్డప్‍తో పరిచయం చేసి, హీరోతో ఫస్ట్ కాన్‍ఫ్రంటేషన్‍ సీన్లోనే గాలి తీసేస్తారు. వరలక్ష్మి శరత్‍కుమార్‍ పాత్రకు సినిమా పిచ్చి వుండడమనేది ఓ క్యారెక్టరైజేషన్‍ అనుకున్నారు కానీ అదేమంత యాడ్‍ అవలేదు. అలాంటి మిస్‍ఫైర్‍ అయిన, లేదా ఎడిట్‍ అయిపోయినా ఓకే అనిపించేవి కొన్ని వున్నాయి. ఉదాహరణకు బి.వి.ఎస్‍. రవి కనిపించే సందర్భాలు, అక్కడి సంభాషణలు. ఇక వరలక్ష్మి విషయానికి వస్తే ఆమె బ్లాంక్‍ ఫేస్‍తో క్లూలెస్‍ అనిపిస్తుంటుంది. అలాగే ఆది, అవినాష్‍, సప్తగిరి తదితరులు వున్నా ఏదో అలంకారానికే అన్నట్టుంటారు. 

సాంకేతికంగా ఉన్నతంగా వుంది. విజువల్స్ చాలా రిచ్‍గా వున్నాయి. సినిమాటోగ్రఫీ యాక్షన్‍ దృశ్యాలలో చాలా బాగుంది. యాక్షన్‍ సీన్స్పై అడిషినల్‍ ఫోకస్‍ పెట్టినట్టు అనిపిస్తుంది. ఆ రిజల్ట్ తెరపై తెలిసిపోతుంది. పాటలు హుషారుగా వున్నాయి. నేపథ్య సంగీతం కాస్త లౌడ్‍ అనిపించినా ఆకట్టుకుంటుంది. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలతో పాటు మాస్‍ సినిమాలకు కూడా స్పేస్‍ వుందని, వాటి కలక్షన్స్ వాటికుంటాయని చాలాసార్లు రుజువయింది. మాస్‍ని దృష్టిలో పెట్టుకుని వారిని మెప్పించడానికి మాత్రమే అన్నట్టున్న ఈ చిత్రం మసాలా ప్రియులకు మాస్‍ బిరియానీ! 

బాటమ్‍ లైన్‍: మసాలా ప్యాక్‍!

ఉదయ్ కిరణ్, తరుణ్ లతో నన్ను పోల్చొద్దు

జగన్ గారి వల్ల కాలర్ ఎగరేసి తిరుగుతున్నా

 


×