cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: మాస్టర్‍

సినిమా రివ్యూ: మాస్టర్‍

సమీక్ష: మాస్టర్‍
రేటింగ్‍: 2/5
బ్యానర్‍: ఎక్స్బి ఫిలిం క్రియేటర్స్, సెవెన్‍ స్క్రీన్‍ స్టూడియోస్‍
తారాగణం: విజయ్‍, విజయ్‍ సేతుపతి, మాళవిక మోహనన్‍, నాజర్‍, ఆండ్రియా, సంతాను భాగ్యరాజ్‍, అర్జున్‍ దాస్‍ తదితరులు
సంగీతం: అనిరుధ్‍ రవిచందర్‍
కూర్పు: ఫిలోమిన్‍ రాజ్‍
ఛాయాగ్రహణం: సత్యన్‍ సూర్యన్‍
నిర్మాత: గ్జేవియర్‍ బ్రిట్టో
కథ, కథనం, దర్శకత్వం: లోకేష్‍ కనగరాజ్‍
విడుదల తేదీ: జనవరి 13, 2020

లక్షలాది మంది అభిమానులు, కోట్లాది అంచనాలున్న సూపర్‍స్టార్‍తో సినిమా అన్నపుడు జనరల్‍గా దర్శకులు సదరు హీరో ఇమేజ్‍కి తగ్గ కథ, సెటప్‍ సిద్ధం చేసుకుని సేఫ్‍ గేమ్‍ ప్లే చేస్తారు. ‘ఖైదీ’ లాంటి స్పెషల్‍ సినిమా తీసిన యువ దర్శకుడు లోకేష్‍ కనగరాజ్‍ మాత్రం కేవలం విజయ్‍ ఇమేజ్‍కి తగ్గ సినిమా చేయాలని కాకుండా తన ముద్ర చాటుకునే ప్రయత్నం చేసాడు.

విజయ్‍ని రెగ్యులర్‍గా కాకుండా కాస్త కొత్తగా చూపించడానికి అతను పడ్డ తపన చాలా సార్లు తెలుస్తుంది. అయితే విజయ్‍ స్టార్‍డమ్‍కి తల వంచేసి, అవసరం లేని బిల్డప్‍ షాట్లు, హైస్పీడ్‍ కెమరా మూమెంట్స్ మీద దృష్టి పెట్టి కాంటెంట్‍ని గాలికొదిలేసి సినిమాలో ‘గాలి’ నింపేసాడు. 

అలాగే ఖైదీ సినిమా హ్యాంగోవర్‍ని కూడా విడిచిపెట్టలేకపోయాడు. అందులో మాదిరిగానే ఈసారి కూడా హీరో నేపథ్యం ఏమిటి, అతను ఇప్పుడు ఇలా వుండడానికి కారణమయిన గతమేంటి అనేదానిపై అస్పష్ట సమాచారమే ఇస్తాడు. అయితే ఖైదీ థ్రిల్లర్‍ కనుక... హీరో గతం కంటే అతని ప్రస్తుతం (పోలీసులను, అక్కడ జైల్లో వున్న స్టూడెంట్స్ను కాపాడడం), అతని భవిష్యత్తు (అసలు ఇంతవరకు ముఖం కూడా చూడని తన కూతురిని కలుసుకోవడం) ఇంపార్టెంట్‍ కనుక ఆ అస్పష్ట సమాచారంతో ఆడియన్స్ డిస్‍కనక్ట్ అవలేదు. పైగా తండ్రీ కూతుళ్ల బలమైన ఎమోషన్‍తో బాగా కనక్ట్ అయ్యారు.

‘మాస్టర్‍’లో కూడా హీరో గతాన్ని క్లియర్‍గా చెప్పే ఉద్దేశం తనకు లేదని అందుకు బదులుగా తెలుగు హిట్‍ సినిమా కథలను విజయ్‍తో చెప్పించి వినోదం పంచాడు కానీ అతని ఎమోషన్‍తో కనక్ట్ అవడానికి మాత్రం తగిన ఎలిమెంట్స్ పెట్టలేకపోయాడు. 

జువెనల్‍ హోమ్‍లో మాస్టర్‍గా వెళ్లిన విజయ్‍ అక్కడి పిల్లలతో కనక్ట్ అవకముందే అక్కడో దారుణం జరుగుతుంది. అప్పుడు అతను కదిలిపోయి అంతవరకు తాగుబోతుగా వున్నవాడే మద్యం వదిలేసి పిల్లల కోసం తపిస్తాడు. కానీ సదరు క్యారెక్టర్‍ ఎందుకు తాగుబోతుగా మారిందో మనకు సరయిన ఇన్‍ఫర్మేషన్‍ వుండదు.

అలాగే ఆ పిల్లలతో అతనికి ఎలాంటి ప్రీవియస్‍ బాండింగ్‍ వుండదు. దాని వల్ల అక్కడ ఎంతగా హీరో ఏడ్చినా కానీ ఎమోషన్‍ వుండదు. హీరోయిన్‍ పరంగా కూడా ఖైదీ టాక్టిక్స్ ట్రై చేసిన ఫీలింగ్‍ వస్తుంది. అందులో మాదిరిగా హీరోయిన్‍ లేకుండా చేయాలనేది ఐడియా అయినా కానీ విజయ్‍ ఇమేజ్‍కి ఎవరో ఒకరయితే వుండాలన్నట్టుగా, వుండీ లేనట్టుగా వుంటుంది హీరోయిన్‍ వ్యవహారం. 

హీరోకి నేపథ్యం వుండదు కానీ విలన్‍గా చేసిన విజయ్‍ సేతుపతికి మాత్రం అతనెందుకు రాక్షసుడిగా మారిపోయాడనే దానికి డీటెయిల్డ్ ఫ్లాష్‍బ్యాక్‍ వుంటుంది. అలాగే అతని రాక్షస చర్యలు ఎలివేట్‍ చేస్తూ కుదురైన సన్నివేశాలు కూడా పడుతుంటాయి.

విజయ్‍పై ఎన్ని స్లో మోషన్‍ షాట్లు పెట్టినా, వెనుక అనిరుధ్‍తో పగిలిపోయే బ్యాక్‍గ్రౌండ్‍ స్కోర్‍ చేయించినా కానీ విజయ్‍ సేతుపతి సీన్లలో వున్న బలం వల్ల అతనే ఎక్కువ హైలైట్‍ అయ్యాడు. చాలా ఈజీగా ఏ పాత్రలోకి అయినా పరకాయ ప్రవేశం చేయగల నేర్పు వుండడంతో తన నెగెటివ్‍ పాత్రను ఎంజాయ్‍ చేసేలా సేతుపతి చక్కని అభినయం ప్రదర్శించాడు. ఆ పాత్రకు రాసిన సంభాషణలు కూడా అలరించడంతో సేతుపతి కనిపించిన ప్రతిసారీ ‘మాస్టర్‍’ను సేవ్‍ చేయగలిగాడు. 

అయితే సుదీర్ఘంగా సాగే పాయింట్‍లెస్‍ సీన్స్కి తోడు, ఎమోషనల్‍గా కనక్ట్ చేసే పాయింట్‍ లేకపోవడంతో ‘మాస్టర్‍’ ఎక్కువ శాతం విసిగిస్తాడు. విషయం లేకుండా మూడు గంటల రన్‍ టైమ్‍ వుండాలనుకోవడం కూడా పెద్ద క్రైమ్‍. ఇంటర్వెల్‍ వరకు ఎంత నిరాశపరచినా కానీ కనీసం ద్వితియార్ధంలో అయినా హీరో, విలన్‍ మధ్య టగ్‍ ఆఫ్‍ వార్‍ వుంటుందనుకుంటే వాళ్లిద్దరూ ఎదురు పడకుండా చేయడంతో మళ్లీ ‘గాలి’ నింపక తప్పలేదు. 

విజయ్‍ ప్రతిసారీ సూపర్‍ హీరోలా వెళ్లి ఏదైనా చేసేసి రావడం కాకుండా ఒక్కోసారి అతను ఏమీ చేయకుండా చేష్టలుడిగి చూస్తుండిపోతే ఓ పిల్లాడు హీరోయిన్‍ని సేవ్‍ చేయడం లాంటి సన్నివేశాలు దర్శకుడి ప్రత్యేకతను చూపెడతాయి. అయితే విజయ్‍ ఇమేజ్‍, స్టార్‍డమ్‍, పొలిటికల్‍ యాస్పిరేషన్స్ వదిలేసి దర్శకుడికి పూర్తి స్వేఛ్ఛ ఇచ్చి వుంటే బాగుండేదనిపిస్తుంది. లేదంటే అసందర్భంగా తనకు కోట్ల మంది అభిమానులున్నారని విజయ్‍ (ఓ తాగుబోతు కాలేజ్‍ ప్రొఫెసర్‍) చెప్పుకోవడమేమిటి? 

విజయ్‍ కచ్చితంగా మునుపటి సినిమాల్లో కంటే కొత్తగా కనిపిస్తాడు. చూయింగ్‍ గమ్‍ స్టయిల్‍గా వేసుకుందామని చూస్తే అది పక్కన పడిపోవడం లాంటి టటెస్‍ ఆకట్టుకున్నా కానీ అందరిలానే లోకేష్‍ కూడా ఫాన్స్కి సరండర్‍ అయిపోవడం వల్ల అటు తన సినిమా తీయలేక, ఇటు విజయ్‍ మార్కు మాస్‍ సినిమా ఇవ్వలేక మాస్టర్‍ రెంటికీ చెడ్డాడు. విజయ్‍ వర్సెస్‍ సేతుపతి ఎదురు పడితే ఎలా వుంటుందో చూడాలనే కోరిక వుంటే తప్ప మాస్టర్‍ సాగతీతకు వాకె•ట్‍ చేసేస్తారు. ఆ సీన్‍ను చివరి వరకు దాచి పెట్టిన లోకేష్‍ దానిని ప్రభావవంతంగానే తెరకెక్కించాడు కానీ అంత పొటెన్షియల్‍ వున్న కాన్‍ఫ్రంటేషన్‍ని వాడుకోకుండా అనవసరమైన విషయాలతో కాలక్షేపం చేసి మూల్యం చెల్లించుకున్నాడు. 

విజయ్‍ ఏమి చేసినా చాలని సంబరపడే అభిమానులు మినహా మిగతా వారికి విజయ్‍ సేతుపతి సీన్స్ మినహా ‘మాస్టర్‍’ అందించేదేమీ లేదు. అనిరుధ్‍ సంగీతం కూడా విజయ్‍ను ‘లేపడానికే’ సరిపోయింది. టాలెంటెడ్‍ డైరెక్టర్లు సూపర్‍స్టార్లతో జత కలిసినపుడు మిడిల్‍ గ్రౌండ్‍ కోసం దేవులాడకుండా అటో, ఇటో వుండాలని ఫిక్స్ అయి అందుకు తగ్గ సెటప్‍ పెట్టుకుంటే బెటర్‍. అందులోను లోకేష్‍ లాంటి క్రియేటివ్‍ ఫిలిం మేకర్స్ పూర్తిస్థాయి మాస్‍ సినిమాలు చేస్తే కనీసం ఆ టెంప్లేట్‍ అయినా కొత్త రూపు తీసుకుని మిగతా డైరెక్టర్లను గైడ్‍ చేయవచ్చు. 

బాటమ్‍ లైన్‍: మిస్‍ఫైర్‍!

 


×