Advertisement

Advertisement


Home > Movies - Reviews

Prem Kumar Review: మూవీ రివ్యూ: ప్రేం కుమార్

Prem Kumar Review: మూవీ రివ్యూ: ప్రేం కుమార్

చిత్రం: ప్రేం కుమార్
రేటింగ్: 1.5/5
తారాగణం:
సంతోష్ శోభన్, రాశి సింగ్, కృష్ణ చైతన్య, రుచిత సాదినేని, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీవిద్య తదితరులు
సంగీతం: అనంత్ శ్రీకర్
ఎడిటింగ్: గ్యారీ
నిర్మాత: శివప్రసాద్ పన్నీరు
దర్శకత్వం: అభిషేక్ మహర్షి
విడుదల: ఆగస్ట్ 18, 2023

మంచి నటుడిగా తన టేలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నా కూడా సంతోష్ శోభన్ కి ఇంతవరకూ సక్సెస్ లేదు. ఏ మాత్రం బజ్ గానీ, అంచనాలు కానీ లేకుండా నేడు "ప్రేం కుమార్" తో మనముందుకొచ్చాడు. 

ప్రేం కుమార్ (సంతోష్ శోభన్) తన ఫ్రెండ్ (కృష్ణ తేజ్) తో కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతుంటాడు. తను నేత్ర (రాశి సింగ్) ని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కానీ రైజింగ్ స్టార్ రోషన్ (కృష్ణ చైతన్య) అనే సినిమా హీరో ఆమె జీవితంలోకి వస్తాడు. ప్రేం కుమార్ పెళ్లికాని ప్రసాదులా మిగిలిపోయి ఉంటాడు. 

డిటెక్టివ్ గా పని చేస్తున్న నేపథ్యంలో అతను అనుకోకుండా వెడ్డింగ్ ప్లానర్ గా మారిన నేత్రని తారసపడతాడు. కానీ అప్పటికి రోషన్ నేత్రని పక్కనపెట్టి అంగన (రుచిత సాదినేని) ని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉంటాడు. అప్పడు నేత్ర ఏం చేస్తుంది? ఎవరితో స్థిరపడుతుంది అనేది కథ. 

పెళ్లి కూతుర్ని పీటల మీద నుంచి హీరోలు లేపుకుపోవడం మనం చాలా సినిమాల్లో చూస్తాం. అప్పుడు ఆల్రెడీ పెళ్లి పీటల మీదున్న పెళ్లికొడుకు పరిస్థితి ఆలోచించం. ఇది సరిగ్గా అలాంటి క్యారెక్టర్స్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథలా అనిపిస్తుంది. ఇక్కడ హీరో అలాంటి విక్టిం. తాను ఒకమ్మాయిని ప్రేమిస్తే ఆమెని ఒక సినిమా హీరో పట్టుకుపోవడం అనేది రజినీకాంత్ "బాషా" లో ఒక సీన్ ని పోలిన "రంగీలా" అంత పాత కథ. అయితే కాన్సెప్ట్ పరంగా ఇది చాలా ఇంటెరెస్టింగ్ లైన్. 

ఇలాంటి సినిమాని డీల్ చేసేటప్పుడు పాత్రల్లో బలం నుంచి, కథనంలో బిగువు వరకు చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ఒక్క పావుగంట చూస్తే చాలు ఈ దర్శకుడిలో సినిమా తీయడంలో కనీస పరిపక్వత కూడా లేదని అనిపిస్తుంది. 

కథనంలో ఎక్కడా ఆసక్తికరమైన అంశాలు కనపడవు. ఫ్రెండ్ తో తాగుడు సీన్లు, అతనితో కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ పని, ఆ తర్వాత రైజింగ్ స్టార్-అంగన ఎపిసోడ్ ఇలా సీన్ల వెంట సీన్లు వెళ్తూ ఉంటాయి. తెర మీద సన్నివేశాలు మారుతున్నా ప్రేక్షకుల్లో ఫీలింగ్ మారదు. బెల్లం కొట్టిన రాళ్లలాగ ఏ భావప్రకటనా లేకుండా అలా జీవచ్ఛవాల్లా పడుండడం తప్ప ప్రేక్షకులు ఇంకేమీ చెయ్యలేరు. 

ఏదీ నేచురల్ గా జరుగుతున్నట్టు ఉండదు. అంతా సినిమాటిక్ లిబెర్టీ కోసం రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. స్క్రిప్టులో ఇంటెలిజెన్స్ ఉండాల్సిన రోజులివి. అలాంటప్పుడు బేసిక్ కన్విక్షన్ ఉండాలి అనే కామన్ సెన్స్ కూడా రాసుకుంటే ఎలా? అయితే చివరాఖర్న క్లైమాక్స్ మాత్రం కాస్తంత అర్ధవంతంగా ముగిసింది. అదొక్కటే ఈ సినిమాకొచ్చిన వాళ్లకి కొంచెం ఊరట.

సంతోష్ తన సహజశైలిలో నటించాడు. సుదర్శన్న్, కృష్ణతేజలతో తన సీన్స్ కొన్ని నవ్విస్తాయి. రాశి సింగ్, రుచితలు తమ పాత్రలకు న్యాయం చేసారు. 

సినిమాలో నిర్మాణవిలువలు మాత్రం బాగున్నాయి. ఎక్కడా రాజీపడినట్టు కనపడలేదు. 

స్క్రిప్ట్ తప్ప మిగితా అన్ని విషయాల్లోనూ శ్రద్ధ తీసుకోవడం వల్ల మొత్తానికి సంతోష్ శోభన్ సినిమాల లిస్టులో ఈ "ప్రేం కుమార్" మరొక పెద్ద ఫ్లాపుగా నమోదయ్యింది. సంతోష్ మీద నమ్మకంతో వచ్చిన ప్రేక్షకులకి మోయాలేనంత తలభారం మాత్రం మిగిలింది. 

బాటం లైన్: 'ఢాం' కుమార్

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా