ఒకవైపు మాజీ భర్త సంజయ్ కపూర్ మళ్లీ పెళ్లి చేసుకుని వార్తల్లోకి వస్తే కరిష్మా కపూర్ మాత్రం ఎంచక్కా విహారాలతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది. సినీ స్టార్ల సమ్మర్ టూర్లన్నీ ముగిసినా కరిష్మా మాత్రం టూర్ మూడ్ లోనే ఉన్నట్టుగా ఉంది.
అలా ఫ్రాన్స్ లోని ఒక బీచ్ లో విహరిస్తూ తన ఎంజాయ్ మెంట్ ను ఫొటోల రూపంలో అందరికీ అర్థమయ్యేలా చేస్తోంది కరిష్మా. బ్లాక్ బికినీలో ఇలాంటి పోజులను పోస్టు చేసింది ఈ మాజీ హీరోయిన్. మరి ఇంత లేటు వయసులో ఇలాంటి దుస్తుల్లో కరిష్మ ఎందుకు పోజులిచ్చినట్టో అర్థం కావడం లేదు.
కొంపదీసి సినిమాల్లో మళ్లీ గ్లామరస్ వేషాలకు ట్రై చేస్తోందా ఏమిటి? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఈ పోజులు చూసి.. యంగ్ కరిష్మ ఎలా ఉండేదో ఊహించుకుంటూ ‘వావ్..’ అంటున్నారు!