అక్కడే ఆగిపోయిన అచ్చెన్న?

మొత్తానికి రచ్చ చేస్తే అరెస్టులు ఉంటాయి. అరెస్టులు అయితే సానుభూతులు ఉంటాయి. జనం అయ్యో పాపం ఇలా అయిందే అని ఓట్లు కుమ్మరిస్తారు. ఆ మీదట అధికారం చేతిలోకి వస్తుంది. ఇదంతా రాజకీయమే. Advertisement…

మొత్తానికి రచ్చ చేస్తే అరెస్టులు ఉంటాయి. అరెస్టులు అయితే సానుభూతులు ఉంటాయి. జనం అయ్యో పాపం ఇలా అయిందే అని ఓట్లు కుమ్మరిస్తారు. ఆ మీదట అధికారం చేతిలోకి వస్తుంది. ఇదంతా రాజకీయమే.

మరి రాజకీయాల్లో తల పండిన అచ్చెన్నాయుడుకు వేరే చెప్పాలా. ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగానే ఆగ్రహంతో ఊగిపోయారు. నా బెడ్ రూం దాకా వస్తారా అంటూ పోలీసుల మీదనే  మండిపోయారు.

అన్ని రోజులూ మీవి కావు, వచ్చే ప్రభుత్వం మాదే, నేను హోం మంత్రిగా వస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబుని అడిగి మరీ పోలీస్ శాఖను తీసుకుంటాను, అ మీదట ఎలా ఉంటుందో చూసుకోండి అంటూ అచ్చెన్న హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

సరే వచ్చేది టీడీపీ ప్రభుత్వం అయినపుడు అది కూడా అచ్చెన్న అరెస్టుల ద్వారా వచ్చే సానుభూతితో పసుపు పార్టీ గెలిచినపుడు హోం మంత్రి దగ్గరే ఉండిపోవడం ఎందుకు ఏకంగా  ముఖ్యమంత్రి పదవే తీసుకుంటే తప్పేంటి అచ్చెన్నా అంటూ సెటైర్లు పడుతున్నాయి వైసీపీ నుంచి.

ఏది ఏమైనా అచ్చెన్నాయుడు మాత్రం తనను అరెస్ట్ చేసిన పోలీసులను అసలు వదలను అంటున్నారు. మరి దీనికి  పోలీసులు వణుకుతున్నారా. అలాగే వణికితే గత సర్కార్ లో ఇలాంటివి ఎన్ని చూడలేదు మరి. అంతేగా..అంతేగా.

అతి చేస్తోన్న మీడియా

ఎందుకు పెదవి విప్పాలి?