ఆహా ఆస్కార్ ఇవ్వాలి…

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కంట త‌డి పెట్ట‌డంపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మోదీ భావోద్వేగంపై నెటిజ‌న్లు సృజ‌నాత్మ‌క పోస్టులు పెడుతూ త‌మ నిర‌స‌న‌ను నిర్భ‌యంగా ప్ర‌క‌టిస్తున్నారు.  Advertisement క‌రోనాపై ముందుండి పోరాడుతున్న…

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కంట త‌డి పెట్ట‌డంపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మోదీ భావోద్వేగంపై నెటిజ‌న్లు సృజ‌నాత్మ‌క పోస్టులు పెడుతూ త‌మ నిర‌స‌న‌ను నిర్భ‌యంగా ప్ర‌క‌టిస్తున్నారు. 

క‌రోనాపై ముందుండి పోరాడుతున్న తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలోని వైద్యులు, వైద్య సిబ్బందితో శుక్రవారం ప్రధాని వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. మ‌హమ్మారి బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకుంటూ ప్ర‌ధాని క‌న్నీటిప‌ర్యంతం కావ‌డం, దాన్ని మీడియా హైలెట్ చేయ‌డం స్టార్ట్ చేసింది.

‘ఈ మహమ్మారి ఎంత తీవ్రంగా ఉందంటే.. ఇంతగా కష్టపడుతున్నా.. చాలా మంది ప్రాణాలను కాపాడలేకపోతున్నాం. మనకు దగ్గరైన వారెందరినో ఈ వైరస్‌ తీసుకెళ్లిపోయింది’ అంటూ గద్గద స్వరంతో క‌న్నీళ్లు పెట్టుకుంటూ వ్యాఖ్యానించారు. కాసేప‌టి వ‌ర‌కూ ఆయ‌న నోటి నుంచి మాట పెగ‌ల్లేదు.

ఇదే సంద‌ర్భంలో సోష‌ల్ మీడియా త‌న‌దైన శైలిలో ప్ర‌ధానిపై సెటైర్లు విస‌ర‌డం మొద‌లు పెట్టింది. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు, సోష‌ల్ యాక్టివిస్ట్ వ‌న‌జ.సి త‌న‌దైన స్టైల్‌లో ప్ర‌ధాని క‌న్నీళ్ల‌పై సెటైర్ విసిరారు. త‌న పోస్ట్‌కు వాట్టె డ్రామా బాజీ అనే శీర్షిక పెట్టారు. ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డి, అతి క‌ష్ట‌మ్మీద ప్రాణాపాయం నుంచి కోలుకున్న ఆమె మోదీ క‌న్నీళ్ల‌పై త‌న ఆవేద‌న‌ను ఆవిష్క‌రించిన తీరు గురించి తెలుసుకుందాం.

‘ఒకవైపు వాక్సిన్లు, ఆక్సిజన్ లేకుండా చేసి మరో వైపు రెండోవేవ్ దారుణంగా ఉండబోతుందని మార్చిలోనే ఎక్స్‌పర్టులు హైచ్చరించినా సరే కుంభమేళాలు, ఎన్నికల సభలు పెట్టి దేశమంతా దాన్ని స్ప్రెడ్ చేయటం. 

జనం ఊపిరాడక చచ్చిపోతుంటే తానుమాత్రం 20 వేల కోట్ల రూపాయలతో విలాసవంతమైన ఇల్లు కట్టుకునే పనిలో మునగటం. లక్షల మంది మరణాలకు కారణం అయి మళ్ళీ మొసలి కన్నీరు పెట్టటం. ఆహా ఆస్కార్ ఇవ్వాలి ఈయనకు’ అని వ‌న‌జ త‌న ధ‌ర్మాగ్ర‌హాన్ని ఫేస్‌బుక్ వేదిక‌గా ప్ర‌ద‌ర్శించారు.

అలాగే గువ్వా న‌రేష్ అనే రాయ‌ల‌సీమ ఎన్ఆర్ఐ ప్ర‌తినిధి ఫేస్‌బుక్ వేదిక‌గా మోదీ క‌న్నీళ్ల‌పై స్పందించారు. ఆయ‌న పోస్టు ఏంటంటే…

‘వెరైటీ ముఖ్యం విశ్వ గురువు గారు .. ఇలా మోనటనీ వచ్చేసే నటన చేసింటే ఇంక్విలాబ్ శ్రీవాస్తవ అస్సలు అమితాబ్‌ బచ్చన్ అయ్యేవాడా? కొద్దిగా వెరైటీ ఉండే పాత్రను ఆలోచించండి. నా సలహా చాయ్ వాలా పాత్ర ట్రయ్ చెయ్యండి బాగుంటుందేమో?’ అని వ్యంగ్యంగా త‌న నిర‌స‌న వాణి వినిపించారు. 

ఇలా అనేక మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌రోనా క‌ట్ట‌డిలో ప్ర‌ధాని విఫ‌లం కావ‌డాన్ని ప్ర‌శ్నించ‌డం, నిల‌దీయ‌డం చూస్తున్నాం. ఈ ప‌రంప‌ర‌లో భార‌తీయుల క‌న్నీళ్ల‌కు కార‌ణ‌మైన పాల‌కుడే క‌న్నీళ్లు కార్చ‌డాన్ని ప్ర‌జాస్వామిక వాదులు నిర‌సిస్తుండ‌డం గ‌మ‌నార్హం.