అఖిల‌ప్రియ నోటి దురుసు…భ‌ర్త‌, త‌మ్ముడికి తిప్ప‌లు

త‌న భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌, త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డిల‌పై అన్యాయంగా, అక్ర‌మంగా కేసులు పెట్టార‌ని మాజీ మంత్రి అఖిల‌ప్రియ ఆరోపించిన నేప‌థ్యంలో, తెలంగాణ పోలీసులు మ‌రింత దూకుడు పెంచారు. అఖిల‌ప్రియ ఆరోప‌ణ‌ల‌ను ఆధారాల‌తో తిప్పికొట్టారు. పోలీసుల‌కు క‌రోనా…

త‌న భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌, త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డిల‌పై అన్యాయంగా, అక్ర‌మంగా కేసులు పెట్టార‌ని మాజీ మంత్రి అఖిల‌ప్రియ ఆరోపించిన నేప‌థ్యంలో, తెలంగాణ పోలీసులు మ‌రింత దూకుడు పెంచారు. అఖిల‌ప్రియ ఆరోప‌ణ‌ల‌ను ఆధారాల‌తో తిప్పికొట్టారు. పోలీసుల‌కు క‌రోనా న‌కిలీ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించిన కేసులో అఖిల‌ప్రియ భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌, ఆమె త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్ రెడ్డి ఉద్దేశ పూర్వ‌కంగానే త‌ప్పుడు ప‌నుల‌కు పాల్ప‌డ్డార‌ని నిరూపించే ఆధారాల‌ను తెలంగాణ పోలీస్ ఉన్న‌తాధికారులు సేక‌రించారు.

త‌మ‌పై అఖిల‌ప్రియ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో తెలంగాణ పోలీస్ అధికారులు మ‌రింత ప‌ట్టుద‌ల‌తో న‌కిలీ ధ్రువ‌ప‌త్రాల స‌మ‌ర్ప‌ణ‌కు సంబంధించి లోతైన ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. దీంతో అఖిల‌ప్రియ భ‌ర్త‌, త‌మ్ముడు మ‌రిన్ని చిక్కుల్లో ప‌డ్డారు. అఖిల‌ప్రియ నోటి దురుసు… భ‌ర్త‌, త‌మ్ముడిని స‌మ‌స్య‌ల్లో కూరుకుపోయేలా చేస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

తెలంగాణ‌లో ముగ్గురు పోలీసు అధికారుల‌పై ఆమె తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని, త‌మ వ‌ద్ద ఏవేవో ఆధారాలున్నాయ‌ని బెదిరింపు ధోర‌ణిలో పోలీస్ అధికారుల‌ను రెండు రోజుల అఖిల‌ప్రియ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.  

హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో ప్రవీణ్‌రావు సోదరులను అపహరించిన కేసులో అఖిలప్రియ భర్త భార్గవరామ్‌, త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్ పోలీసులకు కరోనా నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించడం సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో భార్గ‌వ్‌, జ‌గ‌త్‌ల‌పై కిడ్నాప్‌తో పాటు  బోయిన్‌పల్లి ఠాణాలో రెండో కేసు నమోదయ్యింది. ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో కోర్టు విచారణకు గైర్హాజ‌ర‌య్యేందుకు బావాబామ్మ‌ర్దులు క‌న్నింగ్ ప్లాన్ వేశారు.  

కోర్టు విచారణకు హాజరు కాలేనంటూ భార్గవరామ్‌ బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌కు గత శనివారం కరోనా పాజిటివ్‌ రిపోర్టు ను వాట్సాప్‌లో పంపాడు. అస‌లే క‌రోనా కాలం కావ‌డంతో ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌య్యారు. భార్గ‌వ్ పంపిన సందేశాన్ని ఉన్నతాధికారులకు ఇన్‌స్పెక్ట‌ర్ పంపారు. 

ఆ రిపోర్ట్‌లో కొట్టివేత‌లు, దిద్దుబాట్లు ఉండ‌డంతో ఓ పోలీస్ ఉన్న‌తాధికారికి అనుమానం వ‌చ్చింది. దీంతో పాజిటివ్‌ రిపోర్టు ఇచ్చిన గాయత్రి ల్యాబ్‌కు వెళ్లి విచారిం చాల‌ని స‌ద‌రు ఇన్‌స్పె క్ట‌ర్‌ను ఆ అధికారి ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు కూకట్‌పల్లిలోని ల్యాబ్‌లో నిర్వాహకులు వినయ్‌, రత్నాకర్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. అస‌లు వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. తాము రూ.1200 తీసుకుని పాజిటివ్‌ రిపోర్టు ఇచ్చామంటూ నిజాన్ని వెళ్ల‌గ‌క్కారు.

భార్గవరామ్‌ అక్కడ ఏం చేశాడు? నమూనాలను ల్యాబ్‌ నిర్వాహకులు ఎలా మార్చారు? అనంత‌రం త‌మ‌కు అనుకూలంగా ల్యాబ్‌లో రిపోర్ట్‌ను అనుకూలంగా ఎలా రాయించుకున్నారు… తదితర అంశాలకు సంబంధించిన సీసీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు. ఇలా ప్ర‌తి మోసానికి సంబంధించిన ఆధారాల‌ను రుజువుల‌తో స‌హా ప‌క‌డ్బందీగా సేక‌రించారు. బావ‌కు స‌హ‌క‌రిం చిన జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి పాత్ర‌పై కూడా ఆధారాలు సేక‌రించారు.

కూక‌ట్‌ప‌ల్లిలోని ప్ర‌తిమ ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్న విన‌య్ అనే మిత్రుడి స‌హ‌కారంతో జ‌గ‌త్ ఇంకో వైపు నుంచి న‌కిలీ క‌థ న‌డిపి న‌ట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ నేప‌థ్యంలో అఖిల‌ప్రియ భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌, త‌మ్ముడు జ‌గ‌త్ కోసం తెలంగాణ పోలీస్ ప్ర‌త్యేక బృందాలు వేట సాగిస్తున్నాయి. గ‌తంలో కిడ్నాప్ కేసులో బెయిల్ తెచ్చుకుని అరెస్ట్ నుంచి వీళ్లిద్ద‌రు త‌ప్పించుకుని తిరిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బావాబామ్మ‌ర్దులు ప‌రారీలో ఉన్నారు.