అల్లూరి ఇక అలా అలరిస్తారు….

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి అందరికీ తెలిసిందే. ఆయన కేవలం పాతికేళ్ల ప్రాయంలోనే దేశ దాస్య శృంఖలాలను తెంచడానికి తెల్ల దొరలపైన పోరాటం చేస్తూ వీర మరణం పొందారు.  Advertisement అల్లూరి విశాఖ…

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి అందరికీ తెలిసిందే. ఆయన కేవలం పాతికేళ్ల ప్రాయంలోనే దేశ దాస్య శృంఖలాలను తెంచడానికి తెల్ల దొరలపైన పోరాటం చేస్తూ వీర మరణం పొందారు. 

అల్లూరి విశాఖ ఏజెన్సీలో తన పోరాటాన్ని మూడేళ్ళ పాటు చేశారు. ఇప్పటికి వందేళ్ళ క్రితం అల్లూరి సాగించిన పోరాటం ఎన్నో తరాలకు సరిపడా ధైర్యాన్ని ఇచ్చింది.

ఇవన్నీ ఇలా ఉంటే అల్లూరి స్మారక వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అదే టైమ్ లో విశాఖ ఏజెన్సీకి వచ్చే పర్యాటకుల కోసం అల్లూరి మ్యూజియం ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. 

ఏజెన్సీలోని చింతపల్లిలో గిరిజన స్వాతంత్ర సమరయోధుల పేరిట అద్భుతమైన మ్యూజియం ఏర్పాటు అవుతోంది.  ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి చేతుల మీదుగా నిర్మాణం ప్రారంభం అయ్యే ఈ మ్యూజియం 2023 మార్చినాటికి పూర్తి అవుతుంది.

ఇప్పటిదాకా విశాఖ ఏజెన్సీకి వచ్చే పర్యాటకులు ప్రకృతి అందాలనే ఆస్వాదించేవారు. ఇపుడు దానితో పాటు అల్లూరి వంటి విప్లవవీరుల కధలను కూడా తెలుసుకుని గొప్ప స్పూర్తిని పొందుతారు. 

పూర్తి డిజిటల్ టెక్నాలజీతో రూపొందే ఈ మ్యూజియంలో అల్లూరితో పాటు గంటం దొర, మల్లుదొర విగ్రహాలు కూడా ఉంటాయి.  దాదాపుగా 22 ఎకరాల విస్తీర్ణంత్లో ముప్పయి అయిదు కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకునే ఈ మ్యూజియం విశాఖ సిగలో మరో కళాఖండమే అని చెప్పాలి.