అమరావతి ఉద్యమమా…యుద్దమా?

ఢిల్లీ సరిహద్దుల్లో రైతు పోరు సాగుతోంది. అమరావతిలో రైతుల పేరిట కూడా పోరు సాగుతోంది. డిమాండ్ల సాధన కోసం సీరియస్ గా, అవిశ్రాంతంగా పోరుసాగుతోంది అక్కడ. దానికి నలు వైపుల నుంచి మద్దతు కనిపిస్తోంది. …

ఢిల్లీ సరిహద్దుల్లో రైతు పోరు సాగుతోంది. అమరావతిలో రైతుల పేరిట కూడా పోరు సాగుతోంది. డిమాండ్ల సాధన కోసం సీరియస్ గా, అవిశ్రాంతంగా పోరుసాగుతోంది అక్కడ. దానికి నలు వైపుల నుంచి మద్దతు కనిపిస్తోంది.  ఆశయ సాధన, లక్ష్య సాధనకు ఓ పద్దతిగా వెళ్తున్నారు అక్కడ. 

కేవలం ఒక ప్రాంతానికి చెందిన ఒక వర్గం జనాలు చేస్తున్న పోరుగా కనిపిస్తోంది ఇక్కడ. ఆశయసాధన కన్నా, ఎందుకు దిగిరాదు ప్రభుత్వం, అసలు ఈ ప్రభుత్వాన్నే దింపేయాలి అన్న తీరుగా సాగుతోంది ఇక్కడ. 

ప్రభుత్వాన్ని కన్నా ప్రభుత్వాన్ని నడుపుతున్న నేతను టార్గెట్ చేస్తూ, వీలయినంత రెచ్చగొడుతూ, మరింతగా కార్నర్ చేసి డిమాండ్ సాధించుకోవాలని చూస్తున్నారు. అంతే తప్ప తమ డిమాండ్ సరైనది అని రుజువు చేసే దిశగా సాగడం లేదు. 

ఎందుకంటే ఆ డిమాండ్ కు రాష్ట్రం నలుమూలల నుంచి మద్దతు రావడం లేదు కనుక. ఇక మిగిలింది. ప్రభుత్వాన్ని అన్ని విధాలా కార్నర్ చేసి తమ డిమాండ్ ను సాధించుకోవడమే.  అందుకు మిగిలింది లీగల్ పోరు ఒక్కటే. దాన్ని కూడా సరైన దిశగా చేస్తున్నట్లు కనిపించడం లేదు.

నిజానికి తమ డిమాండ్ లో పస వుంటే, లీగల్ పోరు సాగిస్తూ ఎప్పటికైనా గెలుస్తామనే ధీమా తో వుండొచ్చు కానీ అమరావతిలో అలా జరగడం లేదు ఎమోషనల్, సెంటిమెంటల్ డీలింగ్ చేయాలని ఆతృతపడుతున్నట్లు కనిపిస్తోంది. 

న్యాయమూర్తులు కోర్టుకు వెళ్తుంటే లైన్ లో నిల్చుని అభివాదం చేయడం లేదా, మోకాళ్ల మీద నిల్చోవడం. అంటే న్యాయమూర్తులను సెంటిమెంట్ తో ప్రభావితం చేయడమే గా. ఇలా ప్రభావితం అయితే తీర్పు నిస్పక్షపాతంగా ఎలా వస్తుంది?

న్యాయమూర్తి రిటైర్ అయి వెళ్తుంటే, మళ్లీ అదే హడావుడి. బారులు తీరడం, న్యాయదేవత ప్రతి రూపం వెళ్లిపోతోంది బాధపడడం. అంటే మరే న్యాయమూర్తి వల్ల న్యాయం జరగదు అనుకుంటున్నారా? పైగా ఆ న్యాయమూర్తి ఇప్పటికే ప్రభుత్వనేత మీద తన తీర్పులో కొన్ని వ్యాఖ్యలు చేసి వున్నారు కదా? అప్పుడు పరిస్థితి ఎలా వుంటుంది అనుకుంటున్నారు వీరు. 

ఇదంతా రెచ్చగొట్టే విధానం అవుతుందా? ఉద్యమం అనిపించుకుంటుందా? ప్రభుత్వ నేత అధికారంలోకి రాకముందే తమ ప్రాంతం నుంచి వెళ్తే పసుపు నీళ్లు జల్లింది ఎవరు? ఆధునిక కాలంలో కూడా ఈ అంటరాని విధానాలు సరైనవేనా? ఇలాంటి భావజాలం వున్నవారు చేసే ఉద్యమాన్ని ఎవరైనా ఏ దృష్టితో చూస్తారు? 

ఉద్యమంలో లక్ష్యసాధనకు రకరకాల మార్గాలు వుంటాయి. కానీ రెచ్చగొట్టే, కవ్వింపు చర్యలు వుండవు. వాటిని ఇంత అంత చేసే ప్రచారాలు వుండవు. కానీ యుద్దంలో ప్రత్యర్థిని కవ్వించడం, బయటకు రప్పించడం, ఓడించడం వంటి యుద్ద వ్యూహాలు వుంటాయి. ఉద్యమం వేరు..యుద్దం వేరు.

అమరావతిలో జరుగుతున్నది ఒక వర్గపు యుద్దం మాదిరిగా కనిపిస్తోంది. యుద్దంలో ఏ పక్షానికైనా ఒకటే లక్ష్యం వుంటుంది..మనుటయా..మరణించుటయా? ఇదే లక్ష్యాన్ని ప్రభుత్వం కూడా తీసుకుంటే పరిస్థితి ఏమిటి? 

సంక్షేమ నామ సంవ‌త్స‌రం!

ఇంతవరకూ ఒకా ఛాన్స్ కూడా రాలేదు