తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అదేమంటే తెలుగుదేశ పచ్చ మాఫియా మేధావులు జగన్, వైఎస్సార్సీపీ అసెంబ్లీని బహిష్కరించారు అయినా ప్రజలు గెల్పించారు కదా అనే అర్థం పర్థం లేని వాదన వినిపిస్తున్నారు.
రెండిటికి చాలా వ్యత్యాసముంది. 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుని వారిలో నలుగురికి మంత్రి పదవులిచ్చి వాళ్ళతోనే రాత్రనక పగలనక జగన్మోహన్ రెడ్డిని నానా రకాల బూతులు తిట్టించడం ఒక గొప్ప రాజకీయమని చంద్రబాబు, లోకేష్ శునకానందం పొందుతుంటే, స్పీకర్ కోడెల శివప్రసాదరావు జగన్మోహన్ రెడ్డి కనీస వినతులు కూడా పట్టించుకోకుండా తనే ఇంకా నాలుగు మాటలంటే ఇక ఈ అసెంబ్లీలో మాకు న్యాయం జరగదని బహిష్కరించి పాదయాత్ర చేపట్టారు.
ఈ విషయాన్ని ప్రజలు పూర్తిగా అర్ధం చేసుకుని వైఎస్సార్సీపీనీ, జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి పూర్తిస్థాయి ఘనవిజయం సిద్ధించారు. మరి నేడో? ఒక ప్రధాన రాజకీయ పార్టీ రాజ్యాంగ, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఎన్నికలను బహిష్కరించడమా? వైఎస్సార్సీపీ దౌర్జన్యాలు చేస్తున్నదా? పార్టీ గుర్తులపైన జరిగిన మునిసిపల్ ఎన్నికలలో ఎన్ని సంఘటనలు జరిగాయి? గత 50 ఏళ్లుగా జరిగిన ఎన్నికలతో పోల్చి లెక్కలు చెప్పమనండి చంద్రబాబును.
అతితక్కువ జరిగాయి ఈ సారి. ఇదే మీ ఇష్టుడు నిమ్మగడ్డ వారే సెలవిచ్చారుగా మరి? సో, అవేమీ కావు కారణాలని ప్రజలకు అర్థమయ్యే తెలుగుదేశం ఇక మనలేదన్న వాస్తవం జీర్ణించుకుంటున్నారు. 1982లో ఒక ఉప్పెనలా వచ్చిన తెలుగుదేశం పార్టీ నేడు చంద్రబాబు, పచ్చ మాఫియా మీడియా మేధావుల నిర్వాకానికి బలయిపోయి సోయిలో లేకుండా పోతుండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే అధికార పక్షం ప్రజాసమస్యల పరిష్కారానికి గట్టి కృషి చేస్తుందని చరిత్ర చెపుతున్న పాఠం. జనసైనికుల మీద నాకున్న నమ్మకం వారి నాయకుడి పైన లేనేలేదు. తెలుగుదేశం, జనసేన రెండిటికీ నాయకత్వ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక రాష్ట్ర బీజేపీకి దాని కేంద్ర నాయకత్వమే మరణ శాసనం రాస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డిని చూస్తే మాత్రం ఎవరో ఏదో తనని ప్రోత్సహించి గానీ బలవంతం చేస్తే గానీ అని కాకుండా ప్రజలకు ఏది అవసరమో అని తెలుసుకుని చేయాలనే తపనతోనే చేస్తున్నట్టు అనిపిస్తున్నది.
తెలుగుదేశం మరియు చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలు, వనజాక్షి గారిని ఇసుకలో ఈడ్చడం, ప్రచార యావకోసం గోదావరి పుష్కరాలలో 30 మందికి పైగా బలి ఇవ్వడం లాంటి అనేక కారణాలే కాకుండా కనీసం చింతిస్తున్నామనే చింతన కూడా లేకుండా కళ్ళు నెత్తిన పెట్టుకొని పరిపాలన చేయడం, ధృతరాష్ట్రుడి కంటే గుడ్డిగా పసలేని తన కొడుకును పార్టీలో అతిపెద్ద నాయకుడిగా ప్రమోట్ చెయ్యడమే తెలుగుదేశం పార్టీకి ఆరడుగుల గొయ్యి తవ్వడమని చంద్రబాబుకి అర్థం కాదా లేక అయినా కానీ నేనింతే అనే అహంభావమా లేక ప్రజలన్నా లేక వారి తెలివన్నా చులకనా అనే విషయం అర్ధం కాదు.
దీనికి తోడు తెలుగుదేశానికి ఎప్పుడూ నీడలా వెంటాడే పచ్చ మాఫియా మీడియా, పచ్చ మేధావులు. వీళ్లకు మాత్రం బుర్ర తక్కువన్నా ఉండాలి లేక గతిలేకుండా ఉండాలి. లేకపోతే ఇంకా ఆ సబ్బం హరి, ఆ రఘురామ కృష్ణంరాజు, ఆ శివాజీ, ఆ పట్టాభిలాంటి వాళ్ళు తప్ప వేరేవాల్లు దొరకరా?? వీళ్ళను ప్రజలు నమ్మడం ఎప్పుడో మానేశారు. అప్డేట్ అయితే మంచిది.
అర్థవంతమైన చర్చలు పెట్టి అధికార ప్రతిపక్షాల వైఖరిని నిఖార్సైన పార్టీ ప్రతినిధులతో మేధావులతో చర్చిస్తే ప్రజలకు అవగాహన వస్తుంది. బాబు భజన, జగన్ దూషణ మాత్రమే అయితే అది సమయం వృథానే కాకుండా ప్రజలకు ఇంకా చిర్రు ఎత్తడానికి మాత్రమే! అసలు చంద్రబాబు ముందు తేల్చుకోవాల్సింది పార్టీనా కొడుకా అని – ఆ కత్తి ఈ వరలో ఇమడదు. ప్రజలకి స్పష్టత వచ్చింది ఇప్పటికే!
ఎన్నికల బహిష్కరణ మాత్రం తెలుగుదేశానికి చాలా నష్టం చేస్తుంది. లోకల్ నాయకత్వం బలహీనపడటమే కాకుండా పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. గెలుపు కష్టమనే భావం ఉన్నా వైఎస్సార్సీపీ ఎప్పుడూ ఎన్నికలకు దూరం కాలేదు. నంద్యాల బై ఎలక్షన్, కాకినాడ పురపాలక ఎన్నికలు నిదర్శనం.
తప్పక గెలుస్తారు అనుకున్న 2014 ఎన్నికలలో అధికారంలోకి రాలేకపోయినా ప్రతినిత్యం పోరాడి 2019లో ఘనవిజయం సాధించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 1977 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిలో పూర్తిగా కనుమరుగు అవడంతోబాటు ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీలు కూడా తుక్కుగా ఓడిపోయి ఆ పార్టీని ఒక్క దక్షిణాది మాత్రమే ఆదరించింది. అయినా కానీ, 1978లో చిక్మగలూరులో గెలిచి మళ్ళీ పార్లమెంటులో అడుగుబెట్టి పోరాటం చేసి 1980లో ఘనవిజయం సాధించి మళ్ళీ ప్రధాన మంత్రి అయింది.
ప్రజా నాయకులంటే అలా ఉంటారు. కానీ, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని, వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, ప్రజాసమస్యలు పట్టకుండా, కొడుక్కి కుటుంబానికి బినామీలకు దోచిపెడుతూ, భ్రమరావతి భూకుంభకోణాలు చేసుకునే వాడికి కులజాకీలు పెట్టడం కలకాలం కుదరదని స్పష్టమైందా ఇప్పటికైనా??
నా ఇంకో అనుమానం పార్టీ గుర్తుపైన జరిగే ఈ ఎన్నికల ఫలితాలు 2019 ఎన్నికల ఫలితాలు, 2021 మున్సిపల్ ఎన్నికల ఫలితాల లాగానే అత్యంత దయనీయంగా ఉండి పార్టీలో పూర్తి స్థాయిలో తిరుగుబాటు వచ్చి తననూ తన అసమర్థ కొడుకునీ పార్టీలోంచి గిరాటు వెస్తారేమొననే భయం చంద్రబాబును అణువణువునా వెంటాడుతున్నట్టుంది.
తెలుగుదేశానికి, చంద్రబాబుకి, పచ్చమాఫియాకు చరమగీతం మొదలయిందా?
గురవా రెడ్డి, అట్లాంటా