Advertisement

Advertisement


Home > Politics - Analysis

టీడీపీ ఎంపీ అభ్యర్ధికి చుక్కలు చూపిస్తున్నారా?

టీడీపీ ఎంపీ అభ్యర్ధికి చుక్కలు చూపిస్తున్నారా?

ఆయన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చాలు అనుకున్నారు. టీడీపీ హై కమాండ్ మాత్రం ఎంపీ టికెట్ ని ఇచ్చేసింది. ఆయనే కలిశెట్టి అప్పలనాయుడు. ఆయనను పార్టీలో అందరూ మాస్టర్ అని పిలుస్తారు. ఆయన టీడీపీ శిక్షణా తరగతులలో కార్యకర్తలకు పాఠాలు చెబుతూ క్లాస్ తీసుకునేవారు. ఇపుడు ఆయనకే క్యాడర్ క్లాస్ తీసుకుంటోంది అని అంటున్నారు.

ఆయన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన వారు. ఆయన అయిదేళ్ళుగా అక్కడే తన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆయనను విజయనగరం ఎంపీ సీటుకు దిగుమతి చేశారు. ఆయనకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏ మాత్రం పరిచయాలు లేవు నాయకులు పెద్దగా తెలియదు. క్యాడర్ తో కూడా చనువు పెంచుకోవాల్సి ఉంది.

సమయం చూస్తే తక్కువగా ఉంది. దాంతో మాస్టార్ తన బాధ తాను పడుతున్నారు. ఆయనకు అండగా నిలవాల్సిన పార్టీ నేతలు పెద్దలు మాత్రం హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తున్నారు అని అంటున్నారు. విజయనగరం ఎంపీ సీటులో వేరే జిల్లాల వారికి ఇచ్చి పరీక్ష మాకు పెడతారా అని అధినాయకత్వం మీద కొందరు నేతలు మండిపడుతున్నారు.

అసలే విజయనగరం జిల్లాలో వైసీపీ రాజకీయంగా పైచేయిగా ఉంది అలాంటి చోట ప్రయోగాలు చేసి ఉన్న బలాన్ని కూడా లేకుండా చేసుకోవడమేంటి అని నేతలు అంటున్నారు. ఎంపీ అభ్యర్ధి అంటే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను నడిపించేలా ఉండాలని అలాంటిది  కొత్త వారికి తెచ్చి ఎన్నికల వేల ప్రయోగాలు చేస్తే ఎలా అంటున్నారు.

స్థానికంగా కొందరు సీనియర్ నేతలు ఎంపీ టికెట్ ని ఆశించారు. నెల్లిమర్లకు చెందిన ఒక నేత అయితే ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ అని అనుకున్నారు. అలాగే మాజీ మంత్రి ఒకరు ఎంపీ సీటు మీద గురి పెట్టారు అని అంటున్నారు కానీ అధినాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితులలో ఎలా ముందుకు వెళ్ళేది అని టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు. ఈ విషయంలో  అధినాయకత్వం పునరాలోచన చేస్తుందా అన్నది కూడా టీడీపీ శిబిరంలో చర్చ సాగుతోందిట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?