Advertisement

Advertisement


Home > Politics - Analysis

88 సీట్లు ఎవరికి వస్తాయి?

88 సీట్లు ఎవరికి వస్తాయి?

ఆంధ్ర అసెంబ్లీలో అధికారం సాధించాలంటే కావాల్సిన కనీస సీట్ల సంఖ్య 88. అంటే 175 సీట్లలో సగానికి కాస్త ఎగువగా సీట్లు సాధిస్తేనే అధికారం చేపట్టడం సాధ్యమవుతుంది. ఆంధ్రలో ప్రస్తుతానికి అయితే వేవ్ అనేది లేదు. అది వాస్తవం. పత్రికల్లో వేవ్ వుంది తప్ప గ్రౌండ్ లో లేదు. పోటా పోటీ వుంది. వైకాపా కు కొన్ని చోట్లు, తేదేపాకు మరి కొన్ని చోట్ల ఎడ్జ్ వుంది. అది అభ్యర్ధుల ఎంపిక మేరకు వచ్చిన ఎడ్జ్. ఎవరికైనా కూడా.

రాష్ట్రంలో ఎన్నికల ఎజెండా అన్నది క్లారిటీ వచ్చేసింది. జగన్ కావాలా.. వద్దా. ఇదే సింగిల్ పాయింట్ ఎజెండా. ఈ పరిస్థితిని తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీనే. జగన్ ను ఓ భూతం మాదిరిగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. దాంతో వేరే అంశాలు ఏవీ తెరపైకి రావడం లేదు. కేవలం జగన్ వద్దు అని పదే పదే చెప్పడంతోనే సరిపోతోంది చంద్రబాబుకు, ఆ విధంగా మొత్తం ఫోకస్ అంతా జగన్ మీదకు తెచ్చేసారు. తెలిసో.. తెలియకో. దాని వల్ల జనాల ముందు ఒకటే ప్రశ్న నిలబెట్టినట్లు అయింది. జగన్ కావాలా? వద్దా?

ఇదే ప్రతిపక్షాన్ని వేవ్ దిశగా కాకుండా పోటా పోటీ దిశగా నడిపించింది. నిజానికి ఇదొక్కటే కాదు మరో కారణం కూడా జగన్ ను సేవ్ చేస్తోంది. అది ఏమిటంటే పవన్ స్పీచ్ లు. కేవలం జగన్ ను అణచివేయాలి.. జగన్ అధికారం నుంచి కిందకు లాగేయాలి… ఇలా మాట్లాడుతూ జగన్ మీద విపరీతమైన ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. అది అలా అలా రాను రాను ఓ వ్యక్తిగత వైరంగా మారిపోయింది.

చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ఇలా అంతా కలిపిపోయి ఒక్కటిగా జగన్ మీద ఫైట్ కు దిగడంతో, ఆ పోరాటం కేవలం జగన్ వెర్సస్ అదర్స్ అన్నట్లుగా మారింది. అభివృద్ది లేదు అనేది రాను రాను సాకుగా కనిపించడం పెరిగింది. దీని వల్ల గ్రౌండ్ లెవెల్ లో వేవ్ అన్నది కనిపించడం లేదు. కాపులు మరీ బలంగా వున్న చోట్ల లేదా కూటమి అభ్యర్ధులు బలంగా వున్న చోట్ల పోటా పోటీ లేదా కూటమి ఎడ్జ్ కనిపిస్తోంది. అలా కాని చోట్లు, వైకాపా అభ్యర్థి బలంగా వున్న చోట్ల అటు ఎడ్జ్ కనిపిస్తోంది.

నిజానికి వేవ్ లేదన్న సంగతి విపక్షాలకు, దాని అను కుల మీడియాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడున్న పోటా పోటీ పరిస్థితిని వేవ్ గా మార్చేందుకు తెగ కిందా మీదా అవుతోంది. న్యూట్రల్ ఓటర్లను ఇప్పటి నుంచి తమ వైపు మళ్లించేందుకు తగిన వార్తలు వండి వారుస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో మ్యాజిక్ ఫిగర్ అయిన 88 స్ధానాలను ఎవరు సాధించగలుగుతారు అన్నది పాయింట్.

వైకాపాకు అన్ని ఏరియాల కన్నా ఎక్కువ అడ్వాంటేజ్ వున్నది రాయలసీమ జిల్లాల్లో. దాదాపు యాభై కి పైగా నియోజకవర్గాలు వున్నాయి అక్కడ. ఇక్కడ వైకాపా కనుక నలభైకి పైగా సీట్లు సాధించగలిగితే ఆంధ్రలో అధికారం సాధించేసినట్లే. మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన మిగిలిన యాభై సీట్లను, మిగిలిన జిల్లాల్లో సాధించుకోవడం పెద్త కష్టం కాదు. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి ఎంత పై చేయి సాధించేసినా, నాలుగేసి సీట్లు సాధించడం వైకాపాకు పెద్ద కష్టం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ముఖ్యంగా భాజపాకు కేటాయించిన సీట్లను కూటమి మరిచిపోవచ్చు. ఎందుకంటే పట్టణాలు వదిలేస్తే రూరల్ లో కమలం గుర్తు పెద్ద రిజిస్టర్ కాదు జనాల్లో. ఆ విధంగా 80 సీట్ల వరకు వైకాపా ఖాతాలో పడే అవకాశం కనిపిస్తోంది.

జగన్ పర్యటన ప్రారంభించక ముందు ఆంధ్రలో కూటమిదే పైచేయి అనే భావన వుండేది. ఎందుకంటే మీడియా వండి వారుస్తున్న వార్తల ప్రభావం కూడా అలా వుంది. కానీ వన్స్ జగన్ పర్యటన ప్రారంభమైన తరువాత కోస్తా, గోదావరి జిల్లాల్లో జగన్ కు జనాల్లో వుండాల్సిన ఆదరణ వాటా ఎంతో కొంత వుందన్న క్లారిటీ వచ్చింది.

ఇక్కడ ఇంకో చిత్రమైన సంగతి కూడా వుంది. తేదేపా కోరి, ఎంచుకుని వైకాపా కు చెందిన ఓ రేంజ్ నాయకులను తీసుకుంది. చాలా మందికి టికెట్ లు ఇచ్చింది. కానీ జనసేన, తేదేపాకు చెందిన సెకెండ్ రేంజ్ నాయకులు, చిన్న నాయకులు అంతా బొలోమని వైకాపా దారిలోకి వెళ్తున్నారు. ఎవరు దొరికితే వారిని వైకాపా లోపలకు లాగేస్తోంది. దీనికి వైకాపా ఖర్చు చేస్తోందో, మరోటా అన్నది వేరే సంగతి. కానీ పోల్ మేనేజ్ మెంట్ చేసేది పై లీడర్లు కాదు. కింద కేడర్. ఇప్పుడు ఆ కేడర్ ను టార్గెట్ చేస్తోంది వైకాపా.

ఇప్పుడు దాని వల్ల జరుగుతున్న పరిణామం ఏమిటంటే, గ్రామాల్లో వైకాపాకు ప్రాపగండా పెరుగుతోంది. యాంటీ మాటలు తగ్గుతున్నాయి. ఇప్పుడు వైకాపాలో చేరుతున్న వారు మీడియాలో పాపులర్ అయిన నాయకులు కాదు. ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి అంటే చోటా మోటా జనాలను చేర్చుకుంటున్నారు వైకాపా వాళ్లు అని అనుకుంటున్నారు. కానీ కింది స్థాయిలో జనాలకు నచ్చ చెప్పడానికి, పోలింగ్ మేనేజ్ మెంట్ కు వీళ్లే అవసరం.

ఇలా ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడున్న పోటా పోటీ పరిస్థితిని వేవ్ గా మార్చాలని కూటమి మీడియా కిందా మీదా పడుతోంది. కానీ కూటమి నేతలు మరింతగా ఈ పోరు కేవలం జగన్ మీదనే అనే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. జగన్ సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. తాను ఇది చేసాను.. నచ్చితే ఓటు వేస్తే మరింత చేస్తాను అంటున్నారు. అందువల్ల జగన్ ఓటు బ్యాంక్ ఏదైతే వుందో అది మరింత సాలిడ్ అవుతోంది. గత అయిదేళ్లుగా జగన్ ను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్లు అలాగే వున్నారు.

అందువల్ల పరిస్థితిలో కొత్త మార్పులు రావడం లేదు. దాని వల్ల వేవ్ దిశగా ఎన్నికలు పయనించడం లేదు. ఇదే పరిస్థితి పోలింగ్ వరకు కొనసాగితే మాత్రం జగన్ మ్యాజిక్ ఫిగర్ 88 స్థానాలు సునాయసంగా సాధించేస్తారు. అలా కాకుండా కూటమి తన ప్రచార స్టయిల్ మారిస్తే ఎలా వుంటుందన్నది మును ముందు చూడాల్సి వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?