అబ్దుల్ క‌లాం త‌ర్వాత అంత‌టి స్పంద‌న ర‌త‌న్ కే!

దేశంలో అబ్దుల్ క‌లాం త‌ర్వాత అన్ని వ‌ర్గాల నుంచి అమిత‌మైన స్పంద‌న‌ను చూర‌గొన్న‌ది ర‌త‌న్ టాటానే.

దేశం చాలా మంది ప్ర‌ముఖుల‌ను చూసింది. ఒక్కో ప్ర‌ముఖుడు ఒక్కో సెక్టార్ ప్ర‌జ‌ల అభిమాన పాత్రుడు అవుతాడు. దానికి ర‌క‌ర‌కాల రీజ‌న్లుంటాయి. అలాంటి ప్ర‌ముఖులు దూరం అయిన‌ప్పుడు ఆ వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి ఎక్కువ స్పంద‌న వ‌స్తూ ఉంటుంది. మిస్ యూ పోస్టులు ద‌ర్శ‌న‌మిస్తూ ఉంటాయి. అయితే కొంద‌రు ఇలాంటి వాటికి మిన‌హాయింపు. వీరికి జీరో హేట‌ర్స్ ఉంటారు.

బ‌హుశా దేశంలో అబ్దుల్ క‌లాం త‌ర్వాత అన్ని వ‌ర్గాల నుంచి అమిత‌మైన స్పంద‌న‌ను చూర‌గొన్న‌ది ర‌త‌న్ టాటానే. ఆయ‌న మ‌ర‌ణ వార్త ప్ర‌క‌ట‌న త‌ర్వాత మీడియా క‌న్నా సోష‌ల్ మీడియానే పెద్ద ఎత్తున స్పందించింది. అప్ప‌టికీ ర‌త‌న్ టాటా స‌న్స్ చైర్మ‌న్ హోదా నుంచి వైదొలిగి చాలా కాలం అవుతూ ఉంది. ర‌త‌న్ త‌ర్వాత సైర‌స్ మిస్త్రీ కొంత‌కాలం ఆ బాధ్య‌త‌ల్లో కొన‌సాగారు, ఆ త‌ర్వాత ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో మ‌రొక‌రు తెర‌పైకి వ‌చ్చారు. అయితే టాటా అంటే ర‌త‌న్, ర‌త‌న్ అంటే టాటా అనే భావ‌నే స‌ర్వ‌త్రా కొన‌సాగింది.

వృద్ధుల ద‌గ్గ‌ర నుంచి యువ‌త వ‌ర‌కూ అంద‌రికీ సుప‌రిచితుడు ర‌త‌న్ టాటా వెలుగొందారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత సోష‌ల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ఇన్ స్టాగ్ర‌మ్, వాట్సాప్, ఫేస్ బుక్ ఇలా తేడా లేకుండా.. నెటిజ‌న్లు పోస్టులు పెట్టి ఆయ‌న‌కు నివాళి అర్పించారు. ఈ స్పంద‌న‌ను గ‌మ‌నిస్తే.. దివంగ‌తుడు అయిన భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ క‌లాం త‌ర్వాత‌.. ఆ స్థాయిలో ర‌త‌న్ విష‌యంలోనే స్పంద‌న వ్య‌క్తం అయ్యింద‌ని చెప్ప‌వ‌చ్చు. ద‌శాబ్ద‌కాలం కింద‌ట క‌లాం మ‌ర‌ణించిన‌ప్పుడు నెటిజ‌న్లు ఈ స్థాయిలో స్పందించారు. ఆయ‌న‌కు నివాళి అర్పించ‌డంలో ఆయ‌న‌పై ప్రేమాభిమానాలు వ్య‌క్తం అయ్యాయి. ఎలాంటి ప్ర‌భుత్వ రంగ బాధ్య‌త‌లూ చేప‌ట్ట‌న‌ప్ప‌టికీ ర‌త‌న్ టాటాపై అదే స్థాయిలో ప్రేమాభిమానాలు వ్య‌క్తం అయ్యాయి.

ర‌త‌న్ టాటా ఒక‌ర‌క‌మైన‌ వ్యాపార‌స్తుడే, ఆయ‌న త‌న కంపెనీ లాభాల కోస‌మే ప‌ని చేశారు. అయితే అలా ప‌ని చేసి కూడా ఏ చిన్న వివాదాన్నీ తెచ్చుకొలేదు. కార్పొరేట్ కంపెనీల‌నే ఆయ‌న న‌డిపినా, వినియోగ‌దారుల‌తో వ్యాపార‌మే చేసినా.. టాటా కంపెనీ పేరును ఆయ‌న న‌మ్మ‌కానికి మారుపేరుగా మార్చారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. అంబానీలు, ఆదానీలు వ్యాపార‌స్తులు అయితే ర‌త‌న్ టాటా ఇండ‌స్ట్రియ‌లిస్ట్.

అంబానీలు, ఆదానీలు కూడా దేశంలో ల‌క్ష‌ల కోట్ల వ్యాపారాల‌ను చేస్తున్నారు, కానీ వారికెన్న‌టికీ ర‌త‌న్ టాటా వంటి పేరు ప్ర‌ఖ్యాతులు రావు, దేశ ప్ర‌జ‌ల ప్రేమాభిమానాలు అయితే సొంతం కావు. అదంతే! అదెందుకో తెలుసుకోవాలంటే.. ద‌శాబ్దాల టాటా సంస్థ‌ల మ‌నుగ‌డ‌ను అధ్య‌య‌నం చేయాలి. మార్కెట్ లో ఎత్తుకుపై ఎత్తులు వేసి.. వేల కోట్లు, ల‌క్ష‌ల కోట్లు సంపాదించేసినా కూడా ర‌త‌న్ టాటా లాంటి అభిమానాన్ని పొందాల‌న్నా, టాటా గ్రూప్ త‌ర‌హాలో న‌మ్మ‌కాన్ని చూర‌గొనాల‌న్నా.. ఆ సంస్థ అధిప‌తులు వేసిన బాట‌లోనే సాగాలి కానీ, మ‌రో బాట‌తో అలాంటి ఆత్మీయాభిమానాలు పొంద‌లేరు!

ఇత‌ర సంస్థ‌ల‌న్నింటినీ దెబ్బ కొట్టేసి తాము పైకి రావాల‌నే వ్యాపారం ఏదీ క‌న‌ప‌డ‌దు టాటా వ్య‌వ‌హారాల్లో! రాత్రికి రాత్రి చౌక ధ‌ర‌ల్లో సేవ‌ల‌ను అందుబాటులో పెట్టేసి, అప్ప‌టికే ఆ రంగంలో ప‌ని చేసుకుంటున్న కంపెనీల‌ను దారుణంగా దెబ్బ‌తీసి, వినియోగ‌దారులంద‌రినీ త‌న‌వైపుకు తిప్పుకున్నాకా, ప్ర‌త్య‌ర్థులు పూర్తిగా దెబ్బ‌తిన్నాకా, మోనోప‌లి సాధించాకా.. ఆ త‌ర్వాత వినియోగ‌దారుల నుంచి కూడా వీలైనంత దండుకునే వ్యాపారాలను చేస్తూ.. దేశానికి తామే దిక్కు అన్న‌ట్టుగా త‌యారైన కంపెనీలు చాలానే ఉన్నాయి.

అయితే ప్ర‌జ‌లు కూడా అలాంటి వ్యాపారాల‌ను చేసే వాళ్ల‌ను వ్యాపార‌స్తులుగానే చూస్తారు. వారి వైభోగాలు, వేల కోట్ల‌తో చేసుకునే వేడుక‌లు కూడా.. వ్యాపారాత్మ‌క వినోదంగానే ప్ర‌జ‌లు చూస్తారు. వారి జీవితాల్లోని గ్లామ‌ర్ ను చూసి జ‌నాలు విస్తుబోవ‌డ‌మే కానీ.. వారిపై ఆత్మీయ‌త‌లు, క‌నీసం అభిమానాలు కూడా ఏమీ ఉండ‌వు!

ర‌త‌న్ ఆధ్వ‌ర్యంలో టాటా సంస్థ‌లు ఎంతో ప్ర‌గతిని సాధించాయి. ఆయ‌న టాటా స‌న్స్ చైర్మ‌న్ ప‌ద‌విని తీసుకునే నాటికి ఆరు బిలియ‌న్ డాల‌ర్లు. అంటే సుమారు 18 వేల కోట్ల రూపాయ‌లు. ఆయ‌న 2012లో ఆ హోదా నుంచి విర‌మించుకునే స‌రికి ఆ సంస్థ‌ల ఆదాయాలు అక్ష‌రాలా 5.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను అందుకున్నాయి. టాటా అంటే న‌మ్మ‌కం అనే భావ‌న‌ను ర‌త‌న్ క‌లిగించారు. మంచి నీళ్లు తాగాలాన్నా, ఉప్పు కొనాల‌న్నా.. టాటా ప్రోడ‌క్ట్స్ ఉన్నాయంటే వాటి వైపే వినియోగ‌దారులు మొగ్గుచూపే సెంటిమెంట్ ను ఆయ‌న నాయ‌క‌త్వంలోనే ఆ సంస్థ పొందింది.

పోటీ ఉన్న రంగంలో తాము కొత్త‌గా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నా.. వినియోగ‌దారుడిని ఆక‌ర్షించ‌డానికి చీప్ ట్రిక్స్ ను టాటా అనుస‌రించిన దాఖ‌లాలు అయితే ఎక్క‌డా క‌న‌ప‌డ‌వు. అప్ప‌టికే విదేశీ కంపెనీలు విస్త‌రించి ఉన్న‌రంగాల్లోకి టాటా ఎంట‌రై ప్ర‌త్యేక‌త‌ను చూపించి, వినియోగ‌దారుల‌ను త‌న వైపుకు తిప్పుకుంది కానీ, మొద‌ట త‌క్కువ రేటు అనే వ్యూహాల‌ను అనుస‌రించ‌లేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల వ్యాపారాల‌ను ప్రారంభంతోనే టాటా సంస్థ‌లు ఎక్కువ రేటుతోనే మార్కెట్ లోకి వ‌చ్చాయి.

ర‌త‌న్ ఆధ్వ‌ర్యంలో టాటా అలాంటి ఎత్తు ఏదైనా వేసిందంటే అది ల‌క్ష కారు విష‌యంలోనే. ల‌క్ష రూపాయ‌ల‌కే కారు అంటూ సంచ‌ల‌నం రేపి, ఆ త‌ర్వాత ఆ విష‌యంలో పూర్తిగా చేతులెత్తేసింది. అయినా అది ర‌త‌న్ ఇమేజ్ ను ఏ ర‌కంగానే భంగ‌ప‌ర‌చ‌లేదు.

స‌మీప కాలంలో మ‌రో ర‌త‌న్ టాటా అగుపించ‌డం లేదు, అదే దేశానికి పెద్ద లోటు. ర‌త‌న్ చాలా కాలం కింద‌టే టాటా రోజువారీ వ్య‌వ‌హారాల నుంచి దూరంగా ఉన్నా, ఆ సంస్థ‌లు ఆయ‌న దారిలోనే సాగుతున్నాయ‌నే న‌మ్మ‌కం అయితే ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో గ‌ట్టిగా ఉంది.

34 Replies to “అబ్దుల్ క‌లాం త‌ర్వాత అంత‌టి స్పంద‌న ర‌త‌న్ కే!”

  1. రతన్ టాటా మానవతా వాది, గొప్ప మనిషి అని ఒప్పుకుంటాను కాని అంత మాత్రాన ఆయన కంపెనీ సేవలు గొప్పవి అంటే ఒప్పుకోను. జియో రాక ముందు టాటా docomo 5 జీబీ డేటా ఇవ్వడానికి ₹700 ఛార్జి చేసేది నెల కి. ఇప్పుడు ₹800 కి జియో 84 రోజులకి ఇస్తున్నవి చూస్తే ఇప్పుడు కూడా జియో చవకే!

      1. భయ్యా, ఆర్టికల్ లో రాసిందేమిటి, ముందు చవక గా ఇచ్చి తర్వాత రేట్లు పెంచడం అనే పాయింట్ ఏమిటి? మీకు వీళ్ళు రాసిందే వేదం లా ఉంది!

      1. ఉన్న మాటంటే ఉలుకెందుకు? ఒకవేళ బీజేపీ కి అందరి కంటే విరాళాలు ఎక్కువ ఇచ్చినా ఇదే మాట కి కట్టుబడతాను. క్యాడర్ ని బీజేపీ కంటే బాగా టీడీపీ చూసుకుంటుంది అని నాకు అన్పించినట్లు కూడా రాసాను. మీలాగా గుడ్డి గా పార్టీ ని నమ్మను!

    1. Correct ye jio data charges lo difference techindi. Nenu 256 kbps ki 500 rs katte vadini appudu intlo brod band connection ki . Ippudu ade 500 ki 100 Mbps estunaru . Jio rana antha varaku prati month compulsory ga recharge cheyalisina avasaram ledu , kani adi compulsory chese la chesadu .

      Tata Docomo was first to introduce per second plan. Appudu vunna poti lo adi revolution.

      Reliance, adani kuda business family ne yenduku respect ledu anedi janalaki telusu anukunta

  2. అబ్దుల్ కలాం తరువాత రతన్ టాటా అంటావ్? మరి మన మహా మెత??

    .

    వీళ్ళు చనిపొతె ఎంత మంది గుండె ఆగి చనిపొయారు???

    అదె మన మహా నెత చనిపొతె…..

    ఎకంగా 600 వంది గుండె ఆగి చనిపొయారు?

    ఇక GA లొ ఒకటె ఎడిటొరియల్స్..

    సాక్షి లొ ఒక నెల రొజులు అదెపనిగా భగవత్ గీత స్లొకాలు…ఓక్కడై రావటం.. ఒక్కడై పోవటం అంటూ పాటలు…,

    ఇక ఊరూర మహా నేత విగ్రహాలు…

    ఆ తరువాత మన జగన్ అన్న ఒదార్పు యాత్రలు…

    ఎంత సెంటిమెంట్ పండించారు?

    .

    ఎవరి కైనా ఇంత స్పందన వచ్చిందా యువర్ ఆనర్! కాబట్టి మహత్మా గాంది తొ సహా అందరూ మా మహా నేత తరువాతె!

        1. Papam mada ni kanna , maha meta laga pavurala gutta ki vellaledu.

          Aina akkada tappu emiti 600 people maha meta gurunchi pranalu vodalatam aa leka seva yatra cheyatam aa

  3. కానీ ప్యాలెస్ పులకేశిలా కేవలం ఐదేళ్లలో ఆస్తులను కొన్ని వందల రెట్లు చేయలేక పోయాడు. అదీ ఒక లోటే కదా!

    కానీ ప్యాలెస్ పులకేశిలా నగరానికి ఒక ప్యాలెస్ కట్టుకో గలిగాడా? అది ఒక లోటే కదా!

    వ్యాపారం ఎట్లా చేయాలి. గనులు ఎట్లా తవ్వాలి. ప్యాలెస్లు ఎలా కట్టాలో ఆ రతన్ టాటా మన ప్యాలెస్ పులకేశి నుంచి నేర్చుకోవాలి.

  4. వేల కోట్ల నించి లక్షల కోట్ల వరకు ఆదాయం పెరిగిందంటేనే తెలుస్తుంది కదా.. ఎంత మార్జిన్ లు వేసి సంపాదించారు అన్నది.. అదీ మన లాంటి నిరుపేద నిర్భాగ్య దేశ ప్రజల సొమ్ము.. కలాం లాంటి మహనీయులతో వ్యాపారవేత్తలని పోల్చడం తప్పు…

    1. నువ్వంటే ఉన్న కాస్త గౌరవం పోయింది. మతం పేరుతో యోగ పేరుతో పతంజలి ఉత్పతులకు బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ విధంగా దేశీయ విపణిలో అంత గిరాకీ వచ్చింది ?

    2. Kalam garu leader , ratan Tata garu leader in business. Business ni labam ke cheyali. Lekapothe buyers konaru.

      Simple ga cheppali ante cipla medicines kigsk medicines ki difference telusukovali

  5. True. నాకున్న వాట్సాప్ కాంటాక్ట్స్ లో గతంలో ఎప్పుడు స్టేటస్ పెట్టని వాళ్ళు కూడా మొదటిసారి స్టేటస్ చూసాను. దానిని బట్టి అయన పాపులారిటీని అర్ధం చేసుకోవచ్చు. అది చూసి నిజంగా ఆచ్ర్యా పోయాను, జనంలో ఇంకా మంచికి విలువ వుందా అని.

  6. Around 65% of profits made by the group go to charity every year. And they have been doing this for over 150 years.

    Most of the profits they make are from TCS and JLR (Tata Motors) which generate maximum profit (80%) from other countries but not India. The group is employing around a million people out of which .6 million are in TCS alone as software employees.

    I hope the group’s legacy continues for another century. I feel proud by looking at this group, Wipro’s Azim Premji and HCL’s Shiv Nadar. Hats off to them.

  7. ఆ లలిత జేవెలరీ ఆయన చెప్పినట్టు.. డబ్బులేవరికి ఊరికే రావు.. దానివేనక పెద్ద చరిత్ర ఉంటుంది.. పెద్దమనషులు చరిత్రలు సృష్టిస్తారు.. పేదజనులు ఆ చరిత్రలు చదివి తరిస్తారు…

Comments are closed.