స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ అరెస్ట్ లో కూడా అద్భుతమైన టైమింగ్ ఉంది. ఆ విషయాన్ని టీడీపీ శ్రేణులు బయటపెట్టేంత వరకు వైసీపీ గుర్తించలేకపోయింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. రేపు చంద్రబాబు పెళ్లి రోజు.
రేపు.. చంద్రబాబు-భువనేశ్వరి పెళ్లి రోజు. పెళ్లి రోజున అమ్మానాన్నకు శుభాకాంక్షలు చెప్పాలని లోకేష్ సిద్ధమయ్యారట. మరోవైపు బాలయ్య ఎప్పట్లానే తనదైన స్టయిల్ లో విశెష్ చెప్పడానికి రెడీ అయ్యారట. అంతలోనే చంద్రబాబు ఇలా అరెస్టయ్యారు.
చంద్రబాబు అరెస్ట్ విషయంలో సీఐడీ తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సీనియర్ రాజకీయ నేతకు కనీసం సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, రేపు చంద్రబాబు పెళ్లి రోజు అని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరీ అరెస్ట్ చేశారని కొంతమంది టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వాళ్లు ఆరోపణలు చేసేంత వరకు రేపు చంద్రబాబు పెళ్లి రోజు అనే విషయం వైసీపీకి గానీ, ఇటు సీఐడీకి కానీ తెలీదు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని వైసీపీ శ్రేణులు తమకు అనుకూలంగా భలేగా మార్చుకున్నాయి
ఇన్నాళ్లూ చంద్రబాబు చేసుకున్నవి పెళ్లి రోజులు కావంట, రేపు చేసుకోబోయేదే అసలైన పెళ్లి రోజు అని సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబుకు అసలైన పెళ్లి తాము చేస్తామని, త్వరలోనే అంతా చూస్తారని చెబుతున్నారు. మొత్తమ్మీద తెలిసోతెలియకో సరిగ్గా, చంద్రబాబు పెళ్లి రోజుకు కొన్ని గంటల ముందు, సీఐడీ అతడ్ని అరెస్ట్ చేసింది. దీంతో అంతా వాట్ ఏ టైమింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఈ రాత్రి చంద్రబాబు జాగారం..
తాజా సమాచారం ప్రకారం, చంద్రబాబు ఈరాత్రి సీఐడీ ఆఫీస్ లో జాగారం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ రాత్రంతా చంద్రబాబును ప్రశ్నించి, రేపు పొద్దున్నే కోర్టు ముందు హాజరుపరచాలని సీఐడీ భావిస్తోంది. లెక్కప్రకారం, ఎవర్నయినా అరెస్ట్ చేస్తే, 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలి. చంద్రబాబును ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుంది సీఐడీ. కాబట్టి, రేపు ఉదయం 6 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టాలి. ఈ నిబంధన ప్రకారం, రేపు ఉదయం 5 గంటల ప్రాంతంలో బాబును కోర్టు ముందు ప్రవేశపెట్టాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారట. ఇదే కనుక నిజమైతే.. ఈ రాత్రి చంద్రబాబుకు జాగారమే.
ఇన్నాళ్లూ నాలుక మడతపెట్టారు.. ఇప్పుడు మూగబోయారు..
మరోవైపు చంద్రబాబు, సీఐడీకి చుక్కలు చూపిస్తున్నారు. ఏదో సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్టు మరిచిపోయా, గుర్తులేదు, నాకు తెలీదు లాంటి పొడిపొడి సమాధానాలిస్తున్నారట. వాట్ ఐయామ్ సేయింగ్.. అవునా కాదా తమ్ముళ్లు.. అనే పడికట్టు డైలాగ్స్ తో దంచికొట్టి ఉపన్యాసాలిచ్చే చంద్రబాబు గొంతు మూగబోయింది. దాదాపు 20 ప్రశ్నల్ని, సాక్ష్యాలతో సహా సీఐడీ సిద్ధం చేయగా.. చంద్రబాబు అన్నింటికీ పొంతనలేని సమాధానాలిస్తున్నారట. పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడినట్టు.. ఏదో అడిగితే, ఇంకెటో వెళ్లిపోతోందంట బాబు సమాధానం.