బలి తీసుకుంటున్నది ఎవరు నాగబాబూ!

నాగబాబు తానో అపర మేధావి అనుకుంటారు. ఎక్కడెకక్కడి కొటేషన్లో, పిట్టకథలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. రెండు మూడు రోజుల మౌన వ్రతం అనంతరం నాగబాబు ఓ పిక్చర్ ను ట్విట్టర్ లో షేర్…

నాగబాబు తానో అపర మేధావి అనుకుంటారు. ఎక్కడెకక్కడి కొటేషన్లో, పిట్టకథలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. రెండు మూడు రోజుల మౌన వ్రతం అనంతరం నాగబాబు ఓ పిక్చర్ ను ట్విట్టర్ లో షేర్ చేసారు. కష్టకాలంలోనే నాయకుడి శక్తి సామార్ధ్యాలు బయటపడతాయి అనే అర్థం వచ్చేలా ఓ మాట వదిలారు. అయితే ఇంతకీ ఆ చిత్రంలో వున్నది ఏమిటంటే శిబి చక్రవర్తి పావురాన్ని కాపాడడం కోసం తన తొడ మాసం కోసి, గద్దకు ఇవ్వడం అన్నది. గద్ద బొమ్మకు వైకాపా రంగులు వేసారు.

నాగబాబు క్రియేషన్ అంతా బాగానే వుంది. కానీ ఒకటే సందేహం. పవన్ తన మాసం కోసి ఇస్తున్నది ఎవరికి? 24 సీట్లలోంచి తెగ్గోసి ఇచ్చింది భాజపాకు కదా. ఎవర్ని కాపాడడానికి ఈ విధంగా సీట్లు (మాంసం) తెగ్గోసి ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం కదా. అందువల్ల నాగబాబు పావురానికి పచ్చరంగు, గద్దకు కాషాయం రంగు కదా వేయాలి.

పవన్ ఈ బాధ అంతా వైకాపా కోసం భరిస్తున్నట్లు కలరింగ్ ఇస్తారేంటి నాగబాబూ? మీ తెలివి తెల్లారినట్లే వుంది. మీ సీటుకు ఎసరు పెట్టింది భాజపా/తేదేపా. మీ సోదరుడి సీట్లను తగ్గోస్తున్నది ఎవరు?

జగన్ ఏమన్నా 21 సీట్లే తీసుకోమని వత్తిడి చేసాడా?

భాజపా జనాల కాళ్లు గంటల కొద్దీ పట్టుకోమని జగన్ చెప్పాడా?

ఎక్కడ పోటీ చేయాలో తెలియక పవన్ ను కిందా మీదా అయిపోమని జగన్ చెప్పాడా?

నాగబాబుకు సీటు లేకుండా చేయమని జగన్ చెప్పాడా?

ఏ విధంగా పవన్ చేస్తున్న త్యాగాలకు జగన్ కారణమయ్యాడు. పవన్ ను కార్నర్ లోకి నెట్టి లేదా అందరూ అనుకుంటున్నట్లు ప్యాకేజ్ లోకి నెట్టి, తమ చిత్తానికి ఆడిస్తున్నది చంద్రబాబు నా? జగన్ నా?

ఆ మాత్రం క్లారిటీ లేదు కనుకే, అనకాపల్లి వదులుకుని ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది నాగబాబూ?