Advertisement

Advertisement


Home > Politics - Analysis

జ‌గ‌న్ కేర్ ఫుల్.. వాళ్లు ఏమైనా చేయ‌గ‌ల‌రు!

జ‌గ‌న్ కేర్ ఫుల్..  వాళ్లు ఏమైనా చేయ‌గ‌ల‌రు!

అధికారం కోసం ఎంత‌కైనా దిగ‌జార‌తామ‌ని వారు బాహాటంగానే నిరూపించుకుంటున్నారు. విలువ‌లు, వంకాయ‌లు.. వాళ్ల‌కు లెక్క కాదు! తమ అవ‌స‌రం కోసం ఎవ‌రైనా నిందించ‌గ‌ల‌రు, ఎవ‌రైనా నెత్తికెత్తుకోనూగ‌లరు! న‌వ్వుల పాల‌వుతున్నా.. నీఛ రాజ‌కీయాన్ని కొన‌సాగిస్తున్న వారికి, దాన్ని అందంగా స‌మ‌ర్థిస్తున్న వారికి జ‌గన్ ను భౌతికంగా కొట్టాల‌నే ఆలోచ‌న ఏ మాత్రం పెద్ద‌ది కాదు!

ప్ర‌త్యేకించి జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌..  క‌చ్చితంగా కృష్ణా జిల్లా ప్రాంతంలోకి అడుగుపెట్టిన వెంట‌నే భౌతిక దాడికి జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న వారిపై ఇలా రాళ్ల దాడులు ఏపీ చ‌రిత్ర‌లో లేవు. గ‌తంలో ప్ర‌జారాజ్యం అధినేత చిరంజీవి ప‌ర్య‌టిస్తున్న‌ప్పుడు కోడి గుడ్డు విసిరారు. ఇటీవ‌లే జ‌గ‌న్ పై కాన్వాయ్ పై ఒక చోట చెప్పుతో విసిరారు. అది ఘ‌న‌కార్యం అని తెలుగుదేశం వాట్సాప్ గ్రూపులు దాన్ని తెగ షేర్ చేసి ఆనందించాయి.

ఇప్పుడు జ‌గ‌న్ పై డైరెక్టుగా ప‌దునైన రాయినే విసిరారు. అది గ‌ట్టి గాయాన్నే చేసింది. అయితే.. ఇది చిన్న‌దిగా తీసుకుని జ‌గ‌న్ ముందుకు సాగ‌వ‌చ్చు. అయితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన స‌మ‌యం ఇద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వారు అనుకుంటే ఏదైనా చేయ‌గ‌ల‌రు! 

ఇది త‌మ‌కు చివ‌రి అవ‌కాశం అని, ఇప్పుడు కాక‌పోతే మ‌రెప్పుడూ కాద‌నే భావ‌న ఆ వ‌ర్గంలోనూ, ఆ కులంలోనూ భ‌యం క‌నిపిస్తోంది. జ‌గ‌న్ ను రాజ‌కీయంగా ఎదుర్కొన‌లేక ఇప్ప‌టికే లెక్క‌లేనంత‌మందిని క‌లుపుకున్నారు. ఒంటరిగా జ‌గ‌న్ ను ఎదుర్కొనే శ‌క్తి లేక‌.. వెంట కొంద‌రిని, దొడ్డిదారిన మ‌రి కొంద‌రిని పంపి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయినా కూడా విజ‌యంపై ఎలాంటి విశ్వాసం లేదు.

ఆ స‌మూహం గెలిచే అవ‌కాశ‌మే లేద‌ని స‌ర్వేలు తేట‌తెల్లం చేస్తున్నాయి. జ‌గ‌న్ వెంట న‌డుస్తున్న జ‌న‌స‌మూహం ఆ తోడేళ్ల మంద‌ను భ‌య‌పెడుతూ ఉంది. అందుకు ప‌ర్య‌వ‌స‌న‌మే ఈ రాళ్ల దాడి. ఆ అస‌హ‌నం నుంచినే ఈ దాడి జ‌రిగింది. అయితే ఇది వారి తీవ్ర‌వాద రూపానికి నిద‌ర్శ‌నం. జ‌గ‌నే కావాల‌ని రాళ్లు వేయించుకున్నాడ‌ని.. ప్ర‌చారం చేయ‌గ‌ల వారికి ఉంది. అలాంటి గోబెల్స్ ప్రాప‌గండా వారికి వెన్న‌తో పెట్టిన విద్య‌. అలాంటి గోబెల్స్ ప్ర‌చారంలోనే వారి పునాదులున్నాయి. ఆ తీవ్ర‌వాదాన్ని ఇప్పుడు జ‌గ‌న్ భౌతికంగా కూడా ఎదుర్కొనాల్సిన పరిస్థితులు క‌నిపిస్తున్నాయి. బీ కేర్ ఫుల్ జ‌గ‌న్!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?