Advertisement

Advertisement


Home > Politics - Analysis

బెట్టింగ్ బ్యాచ్ ట్రెండ్ మారుతోంది

బెట్టింగ్ బ్యాచ్ ట్రెండ్ మారుతోంది

ఎన్నికలు అంటే చాలు.. బెట్టింగ్‌లు మొదలైపోతాయి. షేర్ మార్కెట్ మాదిరిగా ఏ రోజు లెక్క ఆ రోజుదే. ఒక్కో రోజు ఒక్కో పార్టీకి ఒక్కో లెక్క డిసైడ్ చేస్తారు బెట్టింగ్ రాయుళ్లు. ఆ మేరకు కాయాల్సి వుంటుంది. ఆంధ్రలో ఎన్నికల హడావుడి స్టార్ట్ అయిన దగ్గర నుంచి తెలుగుదేశం అను కుల సామాజిక మీడియా నానా హడావుడి చేస్తోంది.

ఇప్పటికే తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది అనుకుంటారు ఈ పత్రికలు చదివినా, ఈ చానెళ్లు చూసినా. కానీ బెట్టింగ్ నిర్వాహకుల లెక్కలు వేరుగా వుంటాయి. ఆ లెక్కలు ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ ల ఆధారంగా లెక్కలు కట్టినవి. ఈ గ్రౌండ్ రిపోర్ట్  లెక్కలను బట్టి బెట్టింగ్ లెక్కలు మారుతుంటాయి.

ఇప్పుడు ఇటీవల గత వారం రోజులుగా బెట్టింగ్ లెక్కలు వైకాపా కు అనుకూలంగా మారుతున్నాయట. ఎన్నికల హడావుడికి ముందు తెలుగుదేశం కొద్దిగా ముందుకు వుండేది. అలయన్స్ లెక్కలు, భాజపా జాయిన్ కావడం, టికెట్ ల పంపిణీ వ్యవహారాలు ఇవన్నీ కలిసి టోటల్ గా సీన్ ను కొంత వరకు మార్చినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో జగన్ పర్యటన ప్రభావం కూడా కొంత వరకు వుందంటున్నారు. దాని వల్ల బెట్టింగ్ లెక్కల్లో కూడా మార్పులు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గమ్మత్తేమిటంటే నేషనల్ వైడ్ గా లోక్ సభ స్ధానాల విషయంలో జరుగుతున్న పీరియాడికల్ సర్వేల్లో కూడా మార్పు కనిపిస్తోంది. గతంలో వైకాపా ఏడు స్ధానాల వరకు వస్తాయని అంచనా వేసిన సంస్థలు ఇప్పుడు పది వరకు అంకెలు మార్చాయి. అభ్యర్ధులు డిసైడ్ కావడం, పార్టీలకు కేటాయింపు, ముఖ్యంగా భాజపాకు కాస్త ఎక్కువ స్థానాలే కేటాయించడం వంటివి అన్నీ కలిసి అంకెలను మారుస్తున్నాయి. అలాగే వాటిని బట్టి బెట్టింగ్ లెక్కలు కూడా మారుతున్నాయి. ముందు ముందు ఇంకెలా వుంటుందో ట్రెండ్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?