ఇగో అనేది భలేగా వుంటుంది. సపోజ్ నరనరానా ఇగో నిండిన బిచ్చగాడు…బిచ్చం అడగడట..బిచ్చం వేసుకోండి అంటాడని పెద్దల మాట. తేదేపా నాయకుల వ్యవహారం అలాగే వుంది.
భాజపాతో స్నేహం కావాలి. కానీ అలా దగ్గరకు రావడం లేదని కోపం వుంది. వస్తారేమో మళ్లీ అని అనుమానమూ వుంది. ఇలాంటి నేపథ్యంలో తేేదేపా అభిమానుల, నాయకుల మాటల భలే చిత్రంగా వున్నాయి. శ్రీనివాసరావు అనే తెలుగుదేశం పొలిటికల్ అనలిస్ట్ ఓ యూ ట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించిన ఈ ముత్యాల్లాంటి మాటలు వింటే, భాజపాను దగ్గరకు తీసుకోవాలనుకుంటున్నారో, దూరం పెట్టాలనుకుంటున్నారో అర్థం కాదు.
చిత్తగించండి ఈ మాటలు
తెలుగుదేశం పార్టీకి నిద్రలో కూడా కలవరింత ఒక్కటే అటు భాజపా ఇటు జనసేన తమ పార్టీతో చేతులు కలపాలి.
మోడీకి చంద్రబాబు మీద కోపం, అసూయ, ద్వేషం
అమరావతి నిర్మిస్తే చంద్రబాబుకు పేరు వస్తుందని మోడీ అసూయ పడ్డారు.
గుజరాత్ కు భాజపా వేల కోట్లు దొచిపెడుతోంది.
అమరావతి గురించి మాట్లాడే భాజపాకు సిగ్గులేదు.
భాజపాకు దూరం కాకపోయి వుంటే చంద్రబాబు ఇంకా దారుణంగా ఓడిపోయి వుండేవారు
భాజపా మన శతృవు కాదనే నిజాన్ని చంద్రబాబు గ్రహించి సైలంట్ అయ్యారు
చంద్రబాబుకు రాజకీయం చాతకాదు
భాజపా వాళ్లు కూస్తున్నారు..మాట్లాడడం లేదు.
రాష్ట్రానికి అన్ని విధాలా ద్రోహం చేసింది భాజపానే.
మోడీ స్థాయి దిగజార్చుకుని చంద్రబాబు మీద విమర్శలు చేసారు.
లేకి బుద్దులు వున్నవారు కూడా ప్రధానిగా వుంటే అలా మాట్లాడరు.
అందుకే చంద్రబాబు తిరిగబడ్డారు..
ఆ సంఘటనలు అన్నీ మరచిపోతేనే మంచిది.
తెలంగాణలో భాజపాకు తేదేపా అవసరం వుంది.
తెలంగాణలో ఓటు అడిగే హక్కు భాజపాకు లేదు
కాంగ్రెస్, టీఆర్ఎస్, దేశం పార్టీలకే ఆ హక్కు వుంది.
ఏ పిండీ చేతిలో లేకుండానే భాజపా రొట్టె కొట్టేద్దామని చూస్తోంది.
భాజపా జీవితంలో ఎప్పటికీ చంద్రబాబును కంట్రోలు చేయలేదు.
పొత్తు పెట్టుకోకపోతే ‘దేశం’ ఓట్లు కాంగ్రెస్ కు వేస్తారు.